బారూకు తెలుగుబైబుల్ క్విజ్ | Telugu Bible Quiz

1➤ బారూకు గ్రంథంలో ఎన్ని అధ్యాయాలున్నాయి?

=> ఆరు

2➤ బారూకు గ్రంథంలో ఎన్ని వచనాలున్నాయి?

=> 214

3➤ బారూకు గ్రంథంలో వచనాల శ్రేణి ఎంత?

=> తక్కువ 9, ఎక్కువ 73.

4➤ బారూకు తండ్రి పేరు ఏమిటి?

=> నేరియా (1:1).

5➤ బారూకు ఈ గ్రంథమును బబులోనియా దేశమున సూదునది చెంత చదివినపుడు వినిన ప్రజలెల్లరు ఏమి చేసిరి?

=> ఏడ్చి, ఉపవాసముండి, ప్రార్థించి, చేయగలిగినంత దానము చేసిరి (1:3-6)

6➤ ప్రవాసులు యెరూషలేముకు సొమ్మును పంపుచు వ్రాసిన జాబులో ఎవరెవరి కొరకు ప్రార్థించమనిరి?

=> బబులోనియా రాజు నెబుకద్నెసరు, అతని కుమారుడు బెల్టజ్బరు ప్రవాసులకొరకు (1:10-13).

7➤ ఏ దినములందు దేవాలయమున పాపములను ఒప్పుకొనవలయును?

=> గుడారముల పండుగ మొదటి దినమున, భక్త సమాజము ప్రోగగు దినములందు (1:14).

8➤ దేనికి జరిగిన ఘోర కార్యములు లోకమున మరియెచ్చట జరగవయ్యెను?

=> యెరూషలేము (2:2)

9➤ ప్రభువు యిస్రాయేలుకొరకు సిద్ధము చేసి ఉంచిన శిక్షలన్నిటిని ఎందుకు రప్పించెను?

=> ఆజ్ఞలను పాటింపనందున (2:10).

10➤ ఎవరు మాత్రమే ప్రభుని స్తుతింతురు?

=> బ్రతికియున్నవారు (2:18).

11➤ ప్రభు మందిరమునేల మట్టమెందుకు అయినది?

=> ప్రజల పాపములకు (2:26)

12➤ యిస్రాయేలీయులు శత్రువుల పాలయి కష్టములెందుకనుభవించిరి?

=> జ్ఞానపు బుగ్గను పరిత్యజించుటవలన (3:10-12).

13➤ ఎవరు సదా శాంతిని అనుభవించుదురు?

=> దైవ మార్గమున నడచువారు (3:13).

14➤ దేవుడు జ్ఞాన మార్గమును కనుగొని ఎవరికిచ్చెను?

=> యాకోబు (3:37).

15➤ దేనిని పాటించువారు బ్రతుకుదురు?

=> దేవుని ఆజ్ఞలయిన ధర్మశాస్త్ర జ్ఞానమును పాటించువారు (4:1).

16➤ శాశ్వతముగ నిలుచు దేవుని ఆజ్ఞలయిన ధర్మ శాస్త్ర జ్ఞానమును విడనాడువారు ఏమగుదురు?

=> చనిపోవుదురు (4:1).

17➤ యిస్రాయేలీయులు సృష్టికర్తకు ఏల ఆగ్రహము కలిగించితిరి?

=> దేవునికి కాక దయ్యములకు బలులు అర్పించినందున (4:7)

18➤ ఎవరు వితంతువునై ఏకాకి నైతిననెను?

=> యెరూషలేము (4:9, 16)

19➤ వేని ద్వారా శాంతిని కీర్తిని బడయుదుము?

=> నీతి, భక్తి (5:4).

20➤ యిస్రాయేలీయులను నడిపించుకొని వచ్చునవి ఏవి?

=> దేవుని కృపయు, నీతియు (5:9)

21➤ బబులోనియా రాజు నెబుకద్నెనరు యెరూషలేము పౌరులను బందీలనుగా కొనిపోయినది ఎందుకు?

=> ప్రభువుకు ద్రోహముగా పాపము చేసినందుకు (6:1,2)

22➤ దేవుడు వెలుతురు నిచ్చుటకు వేనిని చేసెను?

=> సూర్యచంద్ర నక్షత్రములను (6:59)

23➤ ఎవరు ఉత్తముడు?

=> విగ్రహములను పెట్టుకొని నగుబాట్లు తెచ్చుకొననని సజ్జనుడు (6:73).