ఎస్తేరు తెలుగుబైబుల్ క్విజ్ | Telugu Bible Quiz

1➤ ఎస్తేరు గ్రంథము వ్రాసినదెవరు?

=> మొరెకయి (9:29)

2➤ ఏ పుస్తకమునందు ఇండియాను గురించి వ్రాయబడినది?

=> ఎస్తేరు గ్రంథమందు (1:1)

3➤ నూట యిరువది యేడు సంస్థానములను ఏలిన రాజు ఎవరు?

=> అహష్వేరోషు (1:1)

4➤ ఎస్తేరును కుమార్తెగా స్వీకరించి, దత్తత తండ్రిగా పోషించినది ఎవరు?

=> మొరెకయి (2:5-7)

5➤ అహష్వేరోషు భార్య పేరేమి?

=> వష్టి (1:9)

6➤ అవిధేయతవలన రాణి పదవిని కోల్పోయిన స్త్రీ యెవరు?

=> వష్టి (1:12-19)

7➤ స్త్రీల కొరకు కోటలో విందు ఏర్పాటు చేసినదెవరు?

=> వష్టి (1:9)

8➤ షూషను రాజధాని అంతఃపుర స్త్రీలమీద అధికారి అయిన నపుంసకుడు ఎవరు?

=> హేగాయి (2:3)

9➤ ఎస్తేరు పేరునకు అర్ధమేమి?

=> నక్షత్రము (2:7)

10➤ ఎస్తేరుకు మరియొక పేరేమి?

=> హదస్సా (2:7)

11➤ ఎస్తేరు షూషను అంతఃపురమున ఎవరి ఆధీనమున ఉంచిరి?

=> హేగాయి (2:8)

12➤ "నీ జాతిని, నీ వంశమును తెలుపకూడదని ఎస్తేరుకు చెప్పినదెవరు?

=> మొర్దికయి (2:10)

13➤ ఎస్తేరు తండ్రి ఎవరు?

=> అబీహాయిలు (2:15)

14➤ ఏ రాజు తన సంస్థానములన్నిటిలో సెలవు ప్రకటించెను?

=> అహష్వేరోషు (2:18)

15➤ రాజుపై ఆగ్రహము చెంది రాజును హత్య చేయ చూచుచుండిని రాజు నివాస ప్రాంగణమునకు కావలి కాయు నపుంసకులిద్దరు ఎవరు?

=> బిగాను, తెరేషు (2:21)

16➤ ఎవరు మోకాళ్ళూని హమానుకు నమస్కరించుటకు తిరస్కరించెను?

=> మొరెకియ (3:2)

17➤ యూదులను నాశనము చేయుటకు రాజు శాసనపు ప్రతులను వ్రాయించి, రాజముద్రగల అంగుళీయకముతో ముద్రించినదెవరు?

=> హామాను (3:1,2)

18➤ ఏ రాణి రాజు యొక్క అంతరమందిరములోనికి లేక ప్రవేశించినది?

=> ఎస్తేరు (5:1)

19➤ హమాను భార్య ఎవరు?

=> సెరెషు (5:10)

20➤ నేను చావవలసి వచ్చినచో చత్తును అని ఎవరు అనిరి?

=> ఎస్తేరు (4:16)

21➤ రాజు యూదుల హింసకుడు హామాను ఆస్తి పాస్తులను ఎవరి వశము చేసెను?

=> ఎస్తేరు (8:1)

22➤ ఎవరి కాలములో యూదులు సంతోషముతో శుభదినముగా పరిగణించి విందుచేసికొనిరి?

=> ఎస్తేరు కాలమున (8:17)

23➤ ఎవరు యూదుల సంక్షేమము కొరకు రాజునకు ప్రధానమంత్రిగాయుండి ప్రజల సంక్షేమము కొరకు ప్రయత్నించినదెవరు?

=> మొరెకయి (10:3)

24➤ దేవుని పేరును ప్రస్తావించని బైబిలులోని గ్రంథమేది?

=> ఎస్తేరు గ్రంథము