మలాకీ తెలుగుబైబుల్ క్విజ్ | Telugu Bible Quiz

1➤ పాత నిబంధనలోని చివరి గ్రంథము పేరేమిటి?

=> మలాకీ

2➤ మలాకీ పేరునకు అర్థమేమిటి?

=> నా దూత

3➤ దేవుడు ప్రేమించిన ఈసాకు కుమారుడు ఎవరు?

=> యాకోబు (1:2)

4➤ ఎవరి పర్వత ప్రాంతము నాశనము చేయబడినది?

=> ఏశావు

5➤ ఎవరి వారసత్వ ప్రాంతమును వన్య మృగముల పాలు చేసెను?

=> ఏశావు (1:3).

6➤ యాజకులు ప్రభువును ఏ రీతిన చిన్న చూపు చూచుచున్నారు?

=> బలిపీఠముపై అపవిత్ర ఆహారము సమర్పించుట ద్వారా (1:6, 7)

7➤ యాజకులు ప్రభువును ఎట్లు కించపరచిరి?

=> ప్రభు పీఠమును తృణీకరించి (1:7)

8➤ ప్రభువు లేవి వంశజుల నిబంధనము ద్వారా వారికి ఏమి ఇచ్చెను?

=> జీవమును, క్షేమమును ప్రసాదించెను. (2:4,5)

9➤ దేవుని గూర్చి జ్ఞానమును బోధించుట ఎవరి బాధ్యత?

=> యాజకుల

10➤ ప్రజలు ఉపదేశము కొరకు ఎవరి వద్దకు పోవలెను?

=> యాజకులు (2:7)

11➤ మనకందరికి తండ్రి ఒక్కడే అని ఏ ప్రవక్త చెప్పెను?

=> మలాకీ (2:10)

12➤ యిస్రాయేలీయులు వేనితో ప్రభువుకు విసుగుపుట్టించిరి?

=> మాటలతో (2:17)

13➤ ప్రజలు ప్రభువును ఎట్లు దోచుకొనుచున్నారు?

=> పదియవ వంతు కానుకలను చెల్లించు విషయమున (38)

14➤ ఎవరు ఆకాశ ద్వారములు విప్పి ప్రజలపై ఆశీర్వాదములను సమృద్ధిగా కురిపించును?

=> ప్రభువు(3:10)

15➤ ప్రభువు ఎవరి పలుకులు విని, ఆయన సన్నిధిలోనే జ్ఞాపకార్ధముగా గ్రంథమున వ్రాయబడెను?

=> ప్రభువుకు భయపడువారు (3:16)

16➤ ప్రభువునకు భయపడిన వారి పేర్లు వ్రాయబడి ఆయన సన్నిధిలోనున్న గ్రంథమేది?

=> జ్ఞాపకార్ధ గ్రంథము (3:16)

17➤ ప్రభువుపట్ల భయభక్తులు జూపు వారిపై భానుకిరణమువలె ఆరోగ్యము కొనివచ్చునది ఎవరు?

=> రక్షణ సూర్యుడు (42)

18➤ ప్రభువు పట్ల భయభక్తులు జూపువారు వేనివలెగంతులు వేయుదురు?

=> బీళ్ళకు పోవు లేగలవలె (4:2)

19➤ ప్రభువు ప్రజలు ఎవరిని అణగదొక్కగా వారు మీకాలిక్రింద ధూళివలె అగుదురు?

=> దుష్టులు (43)

20➤ ప్రభువు ఏకొండపై నుండి యిస్రాయేలీయులందరు పాటించుటకు చట్టములను, విధులను ఇచ్చెను?

=> హోరేబు (4:4)