దానియేలు తెలుగుబైబుల్ క్విజ్ | Telugu Bible Quiz

1➤ దానియేలు గ్రంథము వ్రాసినదెవరు?

=> దానియేలు

2➤ నెబుకద్నెజరు దోచుకొని తెచ్చిన వస్తువులను ఎచ్చట ఉంచెను?

=> దేవతల మందిర ఖజానాలో (1:2)

3➤ నెబుకద్నెజరు రాజు ప్రధాన అధికారి ఎవరు?

=> అఫ్ఫెనసు (1:3)

4➤ యూదులలో పరిచర్యకొరకు ఎంపిక చేయబడిన యువకులు ఎవరు?

=> దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా అనువారలు (1:6)

5➤ ఎవరు యూదులకు పేర్లు మార్చెను?

=> అప్పెనసు (1:37)

6➤ దానియేలుకు యివ్వబడిన క్రొత్త పేరేమిటి?

=> బెత్తెషాజరు (1:7)

7➤ హనన్యాకు పెట్టిన క్రొత్త పేరేమిటి?

=> షడ్రకు (1:7)

8➤ మిషాయేలునకు యివ్వబడిన క్రొత్త పేరేమిటి?

=> మేషకు (1:7)

9➤ అజరయాకు పెట్టిన క్రొత్త పేరేది?

=> అబెద్నగో (1:7)

10➤ తాను అపవిత్రుడుకారాదని ఎవరు తలంచెను?

=> దానియేలు (1:8)

11➤ దానియేలు మరియు అతని మిత్రులకు సంరక్షకునిగా నియమించినది ఎవరు?

=> అప్పెనసు (1:11)

12➤ దానియేలు యితర యువకులు ఏ ఆహారమును అడిగిరి?

=> శాకాహారము (1:12)

13➤ యూదా యువకులను ఎన్ని రోజులపాటు శాకాహారముతో పరీక్షించిరి?

=> 10 రోజులు (1:14)

14➤ ఎవరికి దర్శనములకు, స్వప్నములకు అర్ధమును చెప్పు నేర్పును దేవుడు ప్రసాదించెను?

=> దానియేలు (1:17)

15➤ ఏ చక్రవర్తి పాలనా కాలము వరకు దానియేలు రాజాస్థానముననే ఉండెను?

=> కోరేషు (1:21)

16➤ ఏ రాజు తనకు వచ్చిన కల వలన కలవరపడి నిద్రింపజాలడయ్యెను?

=> నెబుకద్నెసరు (2:1)

17➤ ఎవరు జ్ఞానులనెల్ల వధింపవలెనని శాసనమును ప్రకటించెను?

=> నెబుకద్నెసరు (2:13)

18➤ జ్ఞానులను చంపించువాడు ఎవరు?

=> అర్యోకు (2:14)

19➤ రాజ సంరక్షకుల నాయకుడైన అర్యోకుతో తెలివిగా, నేర్పుగా మాటలాడినది. ఎవరు?

=> దానియేలు (2:14)

20➤ దేవుడు రాత్రి దర్శనములో ఎవరికి రహస్యమును తెలియజేసెను?

=> దానియేలు (2:19)

21➤ ఎవరు రహస్యములను ఎరిగించునది?

=> దేవుడు (2:28)

22➤ మేలిమి బంగారముతోనున్న మహా విగ్రహపు తల అర్థమేమి?

=> బబులోనియా (2:32,38)

23➤ వెండితో చేసిన మహా విగ్రహపు వక్షమును చేతుల అర్ధమేమి?

=> మధ్య పర్శియ (2:32, 39)

24➤ కంచుతో చేసిన మహా విగ్రహపు ఉదరము తొడలు ఏ దేశమును సూచిస్తున్నాయి?

=> గ్రీసు (2:32, 39)

25➤ ఇనుముతో చేసిన మహా విగ్రహపు కాళ్ళు ఏ సామ్రాజ్యమునకు గురుతు?

=> రోము (2:33, 40)

26➤ దానియేలుకు బలి నర్పించి సాంబ్రాణి పొగవేయవలెనని ఎవరు ఆజ్ఞాపించిరి?

=> నెబుకద్నెసరు (2:46)

27➤ ఏ ప్రవక్తను బబులోనియా రాష్ట్రమునకు అధికారిగా చేసెను?

=> దానియేలును (2:48)

28➤ దానియేలు ఎక్కడ ఉండెను?

=> రాజాస్థానమున (2:49)

29➤ బంగారు విగ్రహమును ఎవరు చేయించిరి?

=> నెబుకద్నెసరు (3:1)

30➤ రాజు చేయించిన బంగారు విగ్రహము ఎత్తు ఎంత?

=> 90 అడుగులు (3:1)

31➤ బంగారు విగ్రహమును ఎక్కడ నెలకొల్పను?

=> దూరమైదానమున (3:1)

32➤ శిరము వంచి ప్రతిమను ఆరాధింపని వానికిచ్చు తీర్ను ఏమిటి?

=> ఘనఘన మండు కొలిమిబట్టీలో పడవేయుట (3:6, 11)

33➤ ఘన ఘనమండు కొలిమి బట్టీలో ఎవరిని పడవేసిరి?

=> షడ్రకు, మేషకు, అబేద్నెగో (3:19-22)

34➤ అగ్ని గుండమున కనిపించిన నాలుగవ మనిషి ఎవరు?

=> దైవకుమారుడు

35➤ ఎవరికి బబులోనియా రాష్ట్రమున ఉన్నత పదువులు ఒసగెను?

=> షడ్రకు, మేషకు, అబేద్నెగో (3:97)

36➤ ఏ రాజు మహోన్నత దేవుని అద్భుత కార్యములను ఎరిగించెను?

=> నెబుకద్నెసరు (4:1,2)

37➤ నెబుకద్నెజరు రాజు దానియేలును ఏమని సంబోధించెను?

=> మాంత్రికులందరికి నాయకుడు (4:9)

38➤ భూలోకమధ్యమున అత్యున్నతమైన వృక్షము దృశ్యమున గాంచినది ఎవరు?

=> నెబుకద్నెసరు (4:10)

39➤ పవిత్రుడైన దేవుని ఆత్మ ఎవనిలో ఉన్నది?

=> దానియేలు (4:18)

40➤ ఎవరు భయముతో నోరు విప్పజాలడయ్యెను?

=> దానియేలు (4:19)

41➤ నెబుకద్నెసరు తన శక్తి సామర్ధ్యములతో, కీర్తి ప్రాభవములను ప్రకటింప నిర్మించిన రాజభవనమును ఏమని పలికెను?

=> బబులోనియా ఎంత పెద్దది! (4:29, 30)

42➤ ఏ రాజు తన గర్వమువలన రాజ్యమున నుండి తొలగింపబడెను?

=> నెబుకద్నెసరు (4:30,31)

43➤ ఎవరు ఏడేండ్లపాటు ఎద్దువలె గడ్డి తినెను?

=> నెబుకద్నెసరు (4:32,33)

44➤ ఏ రాజు దేహము మంచులో తడిసెను?

=> నెబుకద్నెసరు (4:33)

45➤ ఏ రాజుకు తన రాజ్యము లభించి పూర్వము కంటే అధికవైభవము కలిగినది?

=> నెబుకద్నెజరు (4:36)

46➤ ఏరాజు, పరలోక రాజును స్తుతించి, కీర్తించి, కొనియాడెను?

=> నెబుకద్నెసరు (4:37)

47➤ నెబుకద్నెజరు తరువాత సింహాసనమును అధిష్టించినది ఎవరు?

=> బెల్టస్సరు (5:1)

48➤ ఏ రాజు వేయిమంది ప్రముఖులకు గొప్ప విందు చేయించెను?

=> బెల్టస్సరు (5:1)

49➤ ఎవరు యెరూషలేమున దేవాలయము నుండి కొల్లగొట్టి తెచ్చిన పానపాత్రులతో ద్రాక్షారసమును సేవింపచేసెను?

=> బెల్టస్సరు (5:3)

50➤ సున్నము కొట్టియున్న ప్రాసాదగోడమీద వ్రాయుచున్న హస్తమును ఎవరుచూచిరి?

=> బెల్టస్సరు (5:5)

51➤ ఎవరు దృశ్యపు ఆలోచనలతో తెల్లబోయెను?

=> బెల్టస్సరు (5:6)

52➤ ఎవరి నడుమునందలి కీళ్ళన్నీ పట్టుదప్పి, మోకాళ్ళు గడగడ వణకెను?

=> బెల్టస్సరు (5:6)

53➤ ప్రాసాదపు గోడమీద ఏమి వ్రాయబడెను?

=> మెనేమెనే తాకేలవు పార్సీస్ (5:25)

54➤ ఏ రాజు దేవుని త్రాసులో తూయబడెను?

=> బెల్టస్సరు (5:27)

55➤ దేవుడు ఏ రాజు పరిపాలనా దినములను లెక్కపెట్టి వానిని తుద ముట్టించెను?

=> బెల్టస్సరు (5:26)

56➤ ఏప్రవక్తకు ఊదా వస్త్రమును తొడిగించిరి?

=> దానియేలు (5:29)

57➤ దానియేలుకు ఉదా వస్త్రము తొడిగి, కంఠాభరణము పెట్టమని ఎవరు ఆజ్ఞాపించిరి?

=> బెల్టస్సరు (5:29)

58➤ బబులోనియా రాజ్యమున ఎవరిని మూడవ అధికారియని ప్రకటించిరి?

=> దానియేలు (5:29)

59➤ దానియేలును బబులోనియా మూడవ అధికారియని ప్రకటించిన రాత్రి ఎవరిని వధించిరి?

=> బెల్టస్సరు (5:30)

60➤ బెల్టస్సరు ఏ దేశపు రాజు?

=> బబులోనియా (5:30)

61➤ బెల్టస్సరు తరువాత ఎవరు రాజయ్యెను?

=> దర్యావేషు (5:31)

62➤ దర్యావేషు ఏ దేశపు రాజు?

=> మాదీయా (5:31)

63➤ ఏ రాజు తన రాజ్యమును పరిపాలించుటకు రాష్ట్ర పాలకులను, పర్యవేక్షకుల నియమించెను?

=> దర్యవేషు (6:1)

64➤ దర్యావేషు ఎంతమంది రాష్ట్ర పాలకులను నియమించెను?

=> 120 మంది (6:1)

65➤ ముగ్గురు పర్యవేక్షకులలో ప్రవక్త ఎవరు?

=> దానియేలు (6:2)

66➤ ఎవరు బుద్ధి కుశలతలో రాష్ట్ర పాలకులను, పర్యవేక్షకులను కూడ మించెను?

=> దానియేలు (6:3)

67➤ ఎవనియందు, తన దేవుని కొల్చు తీరున మాత్రము తప్ప, మరి ఏ అంశమునందును తప్పులు పట్టజాలము అని అనుకొనిరి?

=> దానియేలు (6:5)

68➤ రాజుకు ప్రార్ధన చేయనివారిని ఏ శిక్షకు గురిచేయుదురు?

=> సింహములగుంటలో పడవేయుదురు (6:7)

69➤ ఏ ప్రవక్త రోజుకు మూడు సార్లు దేవుని ప్రార్థించును?

=> దానియేలు (6:10)

70➤ ఏ రాజు దానియేలు గురించి మిగుల చింతించెను?

=> దర్యావేషు (6:14)

71➤ ఏప్రవక్తను సింహముల గుంటలో పడవేసిరి?

=> దానియేలు (6:16)

72➤ ప్రవక్త కొరకు ఏ రాజు నిద్రలేకయే రాత్రి గడిపెను?

=> దర్యావేషు (6:18)

73➤ ప్రవక్త కొరకు ఏ రాజు ఆహారము పుచ్చుకొనక, వినోదములను తిలకింపలేదు?

=> దర్యవేషు (6:18)

74➤ తన రాజ్యములోని జనులెల్లరు దానియేలు దేవునిపట్ల భయభక్తులు చూపవలెనని ఏ రాజు ఆజ్ఞ జారీచేసెను?

=> దర్యవేషు (6:26)

75➤ ఏ రాజు ఏలిన మొదటి ఏట దానియేలు దర్శనముగాంచెను?

=> బెల్టస్సరు (7:1)

76➤ ఏ ప్రవక్తకు సింహాసనములు దర్శనమయ్యెను?

=> దానియేలు (7:9)

77➤ దానియేలు దర్శనమున ఏ మృగమునకు గరుడపక్షి రెక్కలుండెను?

=> సింహము (7:4)

78➤ ఏ మృగమునకు నరుని మనస్సు అలవడెను?

=> సింహము (7:4)

79➤ దానియేలు దర్శనములోని ఏ మృగము కోరల మధ్య మూడు ప్రక్కటెముకలుండెను?

=> ఎలుగుబంటి (7:5)

80➤ వేనవేలు బంటులు, లక్షలకొలది సేవకులు ఎవరియెదుట నిలిచి ఊడిగము చేయుచుండిరి?

=> సింహాసనాసీనుడైన శాశ్వతజీవి (7:9, 10)

81➤ శాశ్వతజీవి గద్దెనుండి ఏమి పారుచుండెను?

=> అగ్ని ప్రవాహము (7:9,10)

82➤ దర్శనమును చూచి ఏ ప్రవక్త భీతితో కంపించెను?

=> దానియేలు (7:15)

83➤ మహోన్నతుని పవిత్ర ప్రజలకు అనుకూలముగా తీర్పు చెప్పినది ఎవరు?

=> శాశ్వత జీవి (7:22)

84➤ దానియేలు రెండవ దర్శనమును ఎచట చూచెను?

=> షూషను నగరమున (8:1,2)

85➤ దర్శనమున దానియేలు ఏ నది ఒడ్డున నిలిచియుండెను?

=> ఊలయ (8:2)

86➤ దర్శనమున నది ఒడ్డున రెండు పొడవైన కొమ్మలు కలిగిన పొటేలిని కాంచినది ఎవరు?

=> దానియేలు (8:3)

87➤ పాదములు నేలను తాకకుండా అతివేగముగా పశ్చిమ దిక్కు నుండి పరుగెత్తుతు వచ్చిన జంతువు ఏది?

=> మేకపోతు (7:5)

88➤ ఒక దేవదూత మరియొక దేవదూతతో మాట్లాడుట ఎవరు వినిరి?

=> దానియేలు (8:13)

89➤ దానియేలు దర్శనమున ఏ దేవదూతను చూచెను?

=> గాబ్రియేలు (8:16)

90➤ గాబ్రియేలు దేవదూత దానియేలుతో ఎక్కడ మాట్లాడెను?

=> ఊలయనది (8:16)

91➤ దేవదూత మాటలాడుచుండగా స్పృహ కోల్పోయి నేలపై బడినదెవరు?

=> దానియేలు (8:18)

92➤ సృహకోల్పోయి నేలపై బడిన దానియేలును, ఏ దేవదూత పట్టుకొని నిలబెట్టెను?

=> గాబ్రియేలు (8:16, 18)

93➤ ఎవరు విషాదమునకు గురియై కొన్ని రోజులు జబ్బుగానుండెను?

=> దానియేలు (8:27)

94➤ బబులోనియాను పాలించిన మాదీయుడైన అహష్వేరోషు కుమారుని పేరేమి?

=> దర్యవేషు (9:1)

95➤ ఎవరు పవిత్ర గ్రంథములు చదివి, 70 సంవత్సరములను గూర్చి తెలిసికొనెను?

=> దానియేలు

96➤ యెరూషలేము 70 ఏండ్లపాటు శిధిలముగా నుండుటను గూర్చి ప్రవచించినది ఎవరు?

=> యిర్మియా (92)

97➤ దేవుడు నిన్ను ప్రేమించెను అని గాబ్రియేలు ఎవరికి చెప్పెను?

=> దానియేలు (9:23)

98➤ దానియేలు కాలమున పారశీకమునకు రాజు ఎవరు?

=> కోరేషు (10:17)

99➤ మంచి భోజనమును భుజింపకుండ మూడు వారములు శోకించిన ప్రవక్త ఎవరు?

=> దానియేలు (10:2,3)

100➤ దానియేలుకు దర్శనమున ఏ బంగారపు నడికట్టు ధరించిన నరుడు కన్పించెను?

=> మేలిమి బంగారం (10:5)

101➤ దానియేలు దర్శించిన నరుని శరీరము ఎట్లు మెరయుచుండెను?

=> రత్నమువలె (10:6)

102➤ ఏ దేవదూత దానియేలు అనిన దేవునికి ఇష్టము అని చెప్పెను?

=> గాబ్రియేలు (10:11)

103➤ ఏ దేవదూత దానియేలుకు సహాయము చేసెను?

=> మిఖాయేలు (10:13)

104➤ దానియేలు ప్రార్ధన ఎన్ని రోజులు నిరోధించబడెను?

=> 21 రోజులు (10:13)

105➤ మిఖాయేలును స్థిరపరచుటకు, బలపరచుటకు ఎవరు అతనివద్ద నిలబడెను?

=> గాబ్రియేలు (11:1)

106➤ నీచుడైన సిరియారాజుతో ఎవరు పోరాడుదురు?

=> దేవుని కొలుచువారు (11:21,32)

107➤ దేవుని జీవ గ్రంథమున పేర్లు వ్రాయబడిన వారిని కాపాడు మహాదూత ఎవరు?

=> మిఖాయేలు (12:1)

108➤ ఎవరు ఆకాశమున నక్షత్రములవలె ప్రకాశింతురు?

=> జ్ఞానులైన నాయకులు (12:3)

109➤ పెక్కుమందికి ధర్మమును పాటించుట నేర్పినవారు ఎలా ప్రకాశింతురు?

=> నక్షత్రములవలె (12:3)

110➤ ఏ గ్రంథమును మూసివేసి, లోకాంతము వరకు ఉండు ముద్రవేసిరి?

=> దానియేలు వ్రాసిన గ్రంథము (12:4)

111➤ నారబట్టలు తాల్చి నది ఎగువ భాగమున నిలిచియున్న దేవదూతను ఎవరు కాంచిరి?

=> దానియేలు (12:6)

112➤ నీ విశ్రమము అనంతరము మరల లేపబడి నీ వంతులో నిలబడి లోకాంతమున బహుమతిని పొందుదువు, అని ఎవరితో చెప్పబడెను?

=> దానియేలు (12:13)