ఆదికాండం తెలుగుబైబుల్ క్విజ్
Adikandam Bible Quiz Answers in Telugu | Telugu Bible Quiz | Telugu Bible Quiz on Genesis Book | Telugu Bible Quiz on Genesis With Answers
1➤ సృష్టి జరిగిన రోజులలో ఎన్నో రోజున బాగుంది అని యావే దేవుడు చెప్పలేదు?
2➤ ఆదికాండం గ్రంథకర్త ఎవరు?
3➤ ఆదికాండములో ముఖ్యమైన వచనమేది?
4➤ జన్మించకుండ మరణించినదవెరు?
5➤ ఆదిలో భూమిని సృష్టించినపుడు భూమి ఏ స్థితిలో వున్నది?
6➤ దేవుడు ఎన్నో రోజున మానవుని సృష్టించెను?
7➤ దేవుడు ఎన్నో రోజును దీవించి పవిత్ర పరచెను?
8➤ మానవుని సృష్టించుటకు ఏ పదార్థమును వాడెను?
9➤ దేవుడు ఏదేను తోటను కాచుటకు ఎవరిని నియమించెను?
10➤ బైబిల్ గ్రంథములో మొదటి ప్రశ్న అడిగినదెవరు?
11➤ ఆదాము అవ్వలు తమ శరీరమును కప్పుకొనుటకు ఉపయోగించిన వస్తువు ఏది?
12➤ జంతు చర్మమును దుస్తులుగా ఆదాము అవ్వకు యిచ్చినదెవరు?
13➤ ఆదాము అవ్వలను ఏదేను వనము నుండి పంపిన తరువాత ఏదోను వనమును సంరక్షించుటకు దేవుడు ఎవరిని ఏర్పాటు చేసెను?
14➤ ప్రపంచములో మొట్టమొదట జన్మించిన నరుడెవరు?
15➤ ప్రపంచములో మొట్టమొదట చనిపోయినదెవరు?
16➤ కయీను ప్రభువు సముఖము నుండి వెడలి ఏ దేశమున నివసించెను?
17➤ నరుడు నిర్మించిన మొదటి నగరమేది?
18➤ పిల్లన గ్రోవిని, సితారను మ్రోగించువారికి మూల పురుషుడెవరు?
19➤ గుడారములలో నివసించు పశువుల కాపరులకు మూలపురుషుడెవరు?
20➤ ఎవరికాలము నుండి ప్రజలు యావేదేవుని ఆరాధింప మొదలు పెట్టిరి?
21➤ మానవుడు ఏ పోలికతో సృష్టించబడినాడు?
22➤ దేవునితో నడచిన యిద్దరు వ్యక్తులెవరు?
23➤ ఆదికాండములో ఎవరు మరణము చవిచూడకుండ దేవునిచే తీసికొనిపోబడెను?
24➤ యావే దేవుడు, ఏ చెట్టు పండును తినవద్దని నరుని ఆజ్ఞాపించెను?
25➤ భూమి మీద ఎక్కువ కాలము బ్రతికినదెవరు?
26➤ నోవా అను పేరుకు అర్థమేమి?
27➤ దేవుని కృపకు నోచుకొనినదెవరు?
28➤ నోవా ఏ చెట్టు కొయ్యతో నావను నిర్మించెను?
29➤ నోవా కుమార్ల పేర్లు తెలుపుము?
30➤ ఓడ తలుపులు ఎవరు మూసిరి?
31➤ ఎంతకాలము జల ప్రళయపు నీరు భూమిపై నిలిచియున్నది?
32➤ ఓడ ఎపుడు నిలిచెను?
33➤ బైబిల్ గ్రంథములో మొదటగా చెప్పబడిన పక్షి పేరేమి?
34➤ నోవాచేత శపించబడిన వ్యక్తి ఎవరు?
35➤ దేవుని యొక్క ఒడంబడిక నోవా ఏ చిహ్నము ద్వారా గ్రహించగలిగిను?
36➤ ఒక వస్తువు పేరు, ఒక ప్రాంతము పేరు ఒకే విధంగా ఉండును అదియేమి?
37➤ ఈజిప్టుకున్న పురాతనమైన పేరేమి?
38➤ ఇతియోపియన్స్ ఏ పేరుతో పిలవబడేవారు?
39➤ పీషోను నది ఏ ప్రాంతమున ప్రవహించుచున్నది?
40➤ ఆకాశాన్నంటే గోపురాన్ని ఆనాటి ప్రజలు ఎచట కట్టారు?
41➤ దేవుడు ఎచట మనుషుల భాషను తారుమారు చేసాడు?
42➤ యోబు జన్మ స్థలము ఒక వ్యక్తి పేరు ఒకేలా ఉన్నాయి, అదియేమి?
43➤ దేవుని దృష్టిలో శక్తివంతుడైన విలుకాడెవరు?
44➤ అబ్రహాము మొదటిగా దేవునికి బలి పీఠము ఎచ్చట నిర్మించెను?
45➤ బైబిల్ గ్రంథములోని మొదటి ప్రవచనము ఎచట ఉన్నది?
46➤ ఏ వచనము ఫోటో ఇవాంజలిజమ్ గా పిలువబడుతుంది?
47➤ మొదటిగా అందగత్తెయైన స్త్రీ అని ఎవరు పిలువబడేవారు?
48➤ తనభార్యయైన శారాను చెల్లెలిగా అబ్రహాము ఎచ్చట చెప్పెను?
49➤ అబ్రహాము ఆస్తికి వారసులుగా మారునని పలికిన దానిపేరేమి?
50➤ లోతు తండ్రి పేరు మరియు లోతు తాత చనిపోయిన ప్రదేశము ఒకే విధము అదియేమి?
51➤ మఘే దగ్గరవున్న సింధూర వృక్షములు ఏ మండలములో నున్నవి?
52➤ సోదమరాజు అబ్రామును కలసికొనుటకు ఏ లోయకు వెళ్ళెను?
53➤ షాలేము రాజు ఎవరు?
54➤ అబ్రహామును దీవించుట కొరకు రొట్టెలు ద్రాక్షారసము తెచ్చిన రాజు పేరేమి?
55➤ ఎవరికి అబ్రహాము దశమ భాగము నిచ్చెను?
56➤ నాకు మనుష్యులను అప్పగించి, ఈ వస్తు వాహనములను నీవు తీసుకొనుమని అబ్రహాము ఎవరితో చెప్పిరి?
57➤ దేవుని పూజారిగా భావించబడిన గొప్ప వ్యక్తి ఎవరు?
58➤ ఏ తరమువారు ఈజిప్టు నుండి కనానుకు వచ్చిరి?
59➤ అబ్రహామునకు బానిసగాయున్న ఈజిప్టుకు చెందిన దాని పేరేమి?
60➤ అడవి గాడిదవలె స్వేచ్ఛగా తిరుగు నరుడు ఎవరు?
61➤ మొట్టమొదటిగా దేవునిదూత స్వరము విన్న స్త్రీ పేరేమిటి?
62➤ ఎన్నో రోజున ఇస్రాయేలీయులు సున్నతి పొందవలెను?
63➤ జన్మించకముందే పేరు పెట్టమని సూచించబడిన మొదటి వ్యక్తి ఎవరు?
64➤ హాగారులో దేవదూత ఎక్కడ మాట్లాడెను?
65➤ ఏ తండ్రి, కుమారుడు ఒకే రోజు సున్నతిచేసికొనిరి?
66➤ ఎన్రీ మరణించినపుడు భూస్థాపితము చేయబడలేదు?
67➤ జన్మించకముదే పేరు సూచించబడిన వాగ్దాన పుత్రుడు ఎవరు?
68➤ సోదాన పట్టణములో గరిష్టముగా ఎంతమంది సజ్జనులుండిన కాపాడవా అని అబ్రహాము దేవుని అడిగెను?
69➤ సోదొమ గొమొర్రా నగరములను నాశనము చేసినపుడు దేవుడు ఎవరిని గుర్తుకు తెచ్చుకొనెను?
70➤ అబ్రాహాము తన కుమారుని దహనబలిగా సమర్పించుటకు ఏ ప్రదేశమునకు వెళ్ళెను?
71➤ అబ్రాహాము పోటేలును దహన బలిగా సమర్పించిన ప్రదేశమునకు ఏమని పేరు పెట్టెను?
72➤ దేవుడు ఏ రాజుకు కలలోకనబడి, నీవు అంతఃపురమునకు చేర్చుకొనిన సారా కారణముగా చత్తువు. ఆమె వివాహిత అని చెప్పెను?
73➤ ఆమె మా తండ్రి కుమార్తె, కాని మా తల్లి కుమార్తెకాదు. ఆమె ఎవరు? ఎవరి భార్య?
74➤ బెరైబా అరణ్యమున గొంతెత్తి యేడ్చినది ఎవరు?
75➤ అబ్రాహాము అబీమెలెకు ప్రమాణములు చేసిన స్థలము పేరు ఏమి?
76➤ ఈసాకు భార్య ఎవరు?
77➤ ఈసాకు రిబ్కాను స్వీకరించుటకు ఎక్కడికి వెళ్ళెను?
78➤ అబ్రాహాము దేహమును ఎచట పాతి పెట్టిరి? మ
79➤ ఎవరి గర్భమునుండి కవలపిల్లలు పరస్పర వైరముగల రెండు జాతులుగా పుట్టిరి?
80➤ ఎవరి ఒడలి యందంతట వెంట్రుకలు ఉండెను?
81➤ ఎవరు తన సోదరుని మడమ పట్టుకొని పుట్టెను?
82➤ ఎవరు తన జ్యేష్టాధికారమును ఎర్రని పులుసుకు అమ్మివేసెను?
83➤ లూజు నగరమునకు మరో పేరు ఏమిటి?
84➤ ఎవరు కలలో నిచ్చెన, నేలనుండి ఆకాశమును అటుచుండుటను చూచెను?
85➤ ఎవరు తన తండ్రికి చెందిన గృహ దేవతా విగ్రహములను దొంగిలించెను?
86➤ "నేను దేవుని ముఖాముఖిచూచితిని, ఐనను బ్రతికి బయటపడితిని” అని ఎవరు అనిరి?
87➤ లేయా యాకోబుల ఏకైక కూతురు పేరు ఏమిటి?
88➤ యాకోబు ఎక్కడ దేవదూతతో కుస్తీపట్టెను?
89➤ “నన్ను దీవించుదాక నిన్ను వెళ్ళనీయను" అని ఎవరు పలికిరి?
90➤ యాకోబు కుమార్తె దీనాను ఎవరు చెర పెట్టి మానభంగము చేసెను?
91➤ దేవుడు యాకోబును ఏ పేరున పిలిచెను?
92➤ ఎవరు తన భార్య సమాధిమీద స్తంభమును ఎత్తెను?
93➤ అడవిలో ఉష్ణ దారలను కనుగొన్నవాడు ఎవరు?
94➤ యిస్రాయేలు ఎవరిని ఇతర కుమారులకంటె ఎక్కువగా ప్రేమించెను?
95➤ యోసేపును ఎన్ని వెండినాణెములకు యిష్మాయేలీయులకు అమ్మిరి?
96➤ యోసేపుకు ఫరోరాజు పెట్టిన మారుపేరు ఏమిటి?
97➤ యోసేపును యిష్మాయేలుకు అమ్మివేయుదమని చెప్పిన సోదరుని పేరు ఏమిటి?
98➤ ఎవనినిబట్టి భగవంతుడు పొడిఫరు ఇంటిని చల్లని చూపుచూచెను?
99➤ తలనెరసియున్న నేను దిగులుతో క్రుళ్ళిచావవలసినదే” అని ఎవరు అనిరి?
100➤ బక్కచిక్కిన ఆవులు, కండపట్టిన ఆవులను తినివేయు కలను కాంచినది ఎవరు?
101➤ ఎవరు తన జన్మదినోత్సవమున విందు ఏర్పాటు చేసెను?
102➤ యోసేపు తన సోదరులలో ఎవనిని పట్టుకొని కట్టివేసెను?
103➤ సోదరానురాగముతో కన్నీరాపుకొనజాలక లోపలికి వెళ్ళి వెక్కివెక్కి ఏడ్చినది ఎవరు?
104➤ దేవుడు ఎవరిని ఫరోరాజుకు మంత్రిగా, అతనింటికి సర్వాధికారిగా చేసెను?
105➤ బేరైబా అను మాటకు అర్థము ఏమిటి?
106➤ యాకోబు కుమారులు ఈజిప్టులో ఎక్కడ నివసించిరి?
107➤ ఎవరు జల ప్రవాహమువలె పరవళ్ళు తొక్కును, అయినను అతిశయిల్లలేడు?
108➤ యాకోబు ఎవరి మంత్రాలోచనలలో పాల్గొనను అనెను?
109➤ ఎవరు సముద్ర తీరమున నివసించునని యాకోబు చెప్పెను?
110➤ ఎవరు స్వేచ్ఛగా తిరుగు లేడివంటివాడు?
111➤ ఎవరు, చనిపోయిన తన తండ్రి ముఖముమీద వ్రాలి అతనిని ముద్దుపెట్టుకొని రోదించెను?
112➤ యాకోబు ఎవరిని సింహపు పిల్లగా ఆరోపించెను?
113➤ ఎవరు త్రోవలోని పామువంటివాడు, దారిలోని విష సర్పమువంటివాడు?
114➤ ఎవరిని జలదారచెంతనున్న ఫల వృక్షమువంటివాడని ఆరోపించెను?
115➤ ఎవరు ఆకలిగొన్న తోడేలువంటివాడు?
116➤ “దేవుడు మిమ్ము ఆదుకొనినపుడు ఈ దేశము నుండి నా అస్థికలను మీ వెం కొనిపోవుడు" అని ఎవరు చెప్పెను?
0 Comments