సామెతలు తెలుగుబైబుల్ క్విజ్ | Telugu Bible Quiz

1➤ సామెతల గ్రంథమును వ్రాసినది ఎవరు?

=> సొలోమోను (1:1)

2➤ విజ్ఞానమునకు మొదటి మెట్టు ఏది?

=> దేవుని యెడల భయభక్తులు కలిగియుండుట (1:7)

3➤ ఏవి జీవన దాయకములు మరియు సంపూర్ణ ఆరోగ్యమునొసగును?

=> దేవుని పలుకులు (4:22)

4➤ సోమరి వేనిని చూచి బుద్ధి తెచ్చుకొనును?

=> చీమల వద్ద నుండి (6:6)

5➤ ఎవరు నరుల చేష్టలనెల్ల కనిపెట్టుచుండును?

=> ప్రభువు (5:21)

6➤ మనము పయనము చేయునపుడు ఏది నడిపించును?

=> దేవుని వాక్కు (6:22)

7➤ దేనివలన మృత్యువునుండి తప్పుకోవచ్చును?

=> సత్యనిష్టవలన (11:4)

8➤ ముత్యములకన్న శ్రేష్టమైనది ఏది?

=> విజ్ఞానము (8:11)

9➤ ఎవరు పంది ముట్టెకు బంగారు పోగులాంటివారు?

=> అందమైన అవివేక స్త్రీ (11:22)

10➤ ఎవరు తండ్రి మందలింపును లెక్కచేయడు?

=> పొగరుబోతు (131)

11➤ ఎవరి ఆస్తి తరతరములదాకా తన వంశజులకే దక్కును?

=> సత్పురుషుని (13:22)

12➤ ఏది ఎముకలలో పుట్టిన కుళ్ళు వంటిది?

=> అసూయ (14:30)

13➤ ఎవరి హృదయము ప్రభుని అధీనములో పంటకాలువ వలెనున్నది?

=> రాజు హృదయము (21:1)

14➤ ఎవరు తెలివిగలవారు?

=> మితముగా మాట్లాడువారు (17:27)

15➤ ఏడుమారులు పడినను తిరిగిలేచునది ఎవరు?

=> నీతిమంతుడు (24:16)

16➤ ఏ గాలి వర్షమును కురిపించును?

=> ఉత్తరపు గాలి (25:23)

17➤ సమయోచితముగా పలుకబడినమాట దేనిని పోలియున్నది?

=> వెండి పళ్ళెములో ఉంచబడిన బంగారము వంటిది (25:11)

18➤ జలగకు పుట్టిన ఇద్దరు కుమార్తెలెవరు?

=> నాకిమ్ము, నాకిమ్ము అను యిద్దరు కుమార్తెలు (30:15)

19➤ చిన్న జీవులైనను మిక్కిలి జ్ఞానముకలిగినవి ఏవి?

=> చీమలు (30:25)

20➤ ఏవి తమ నివాసములను కొండలమీద నిర్మించుకొనును?

=> సత్తువ లేని చిన్న కుందేళ్ళు (30:26)

21➤ రాజుల కోటలలో కూడ నివసించునది ఏది?

=> బల్లి (30:28)

22➤ కోపమును రెచ్చగొట్టినచో ఏమి పుట్టును?

=> కలహము (30:33)

23➤ వాణిజ్య నౌకవలె దూరప్రాంతములనుండి భోజన పదార్థములను ఎవరు తెప్పించును?

=> ఆదర్శ గృహిణి (31:14)

24➤ సొలోమోను దృష్టిలో నమ్మరానివి ఏవి?

=> తళుకు బెళుకులు (31:30)