రాజుల మొదటి గ్రంథము తెలుగుబైబుల్ క్విజ్ | Roman catholic bible quiz Telugu on 1st Kings

1➤ కంబళ్ళతో కప్పినను ఏ రాజు దేహమునకు వేడి పుట్టదయ్యెను?

=> దావీదు (1:1)

2➤ దావీదు రాజు ముసలి ప్రాయమున ఏ షూనేమున యువతి రాజు వద్దనే ఉండి అతనికి పరిచర్యలు చేసెను?

=> అబీషగు (1:3,4)

3➤ దావీదు ముసలి ప్రాయమున అతనిపై తిరుగబడినకుమారుడు ఎవరు?

=> అదోనియా (1:5)

4➤ ఎవరు రాజు కావలెనని రధమును, గుఱ్ఱములను, బంటులను నియమించుకొనెను?

=> అదోనియా (1:5)

5➤ సోలోమోను తల్లి ఎవరు?

=> బక్సెబ (1:11)

6➤ దావీదు తరువాత అతని స్థానమున రాజు అయినది ఎవరు?

=> సొలోమోను (1:30)

7➤ సోలోమోనును రాజుగా అభిషేకించిన యాజకుడు ఎవరు?

=> సోదోకు (1:32, 34)

8➤ ఎవనిని దావీదుకంటె అధికునిజేయును గాక, అతని రాజ్యమును సుప్రసిద్ధము చేయునుగాక! అని కొలువుగాండ్రు దీవించిరి?

=> సాలోమోను (1:47)

9➤ ఎవరు సోలోమోనుకు భయపడి ప్రభు మందిరము ప్రవేశించి పీఠము కొమ్ములకు పెనవేసికొనెను?

=> అదోనియా (1:50),

10➤ దైవ చిత్తము ప్రకారము సోలోమోను రాజయ్యెను అని ఏరాకుమారుడు పలికెను?

=> అదోనియా (2:15)

11➤ రాజుతల్లి అయిన పూర్వపు సైనికుని భార్య ఎవరు?

=> బత్తైబ (2:19)

12➤ దైవ మందసమును పూర్వము కాపాడినందున మరణము నుండి విడుదల పొందిన యాజకుడు ఎవరు?

=> అబ్యాతారు (2:26)

13➤ యాజకత్వము నుండి తొలగింపబడిన యాజకుడు ఎవరు?

=> అబ్యాతారు (2:27)

14➤ ఏ రాజు అబ్యాతారును యాజకత్వమునుండి తొలగించెను?

=> సోలోమోను (2:27)

15➤ ఏలి వంశమునకు చెందిన చివరి యాజకుడు ఎవరు?

=> అబ్యాతారు (2:27)

16➤ ఎవరు యావే గుడారమున చావవలయునని నిర్ణయించుకొనెను?

=> యోవాబు (2:30)

17➤ ఎవరి శవమును అతని యింటనే పాతిపెట్టిరి?

=> యోవాబు (2:33,34).

18➤ ఏ సైన్యాధిపతి యెడారిలో యిల్లు నిర్మించుకొని నివసించెను?

=> యోవాబు (2:34)

19➤ షిమీయెరూషలేమును వీడరాదని నిర్ణయించిన సరిహద్దు వాగు ఏది?

=> కీడ్రోను (2:37)

20➤ షిమీని మట్టుపెట్టినది ఎవరు?

=> బెనాయా (2:46)

21➤ ప్రభువు ఎక్కడ సోలోమోసుకు కలలో కన్పించి నీకేమి కావలెనో కోరుకొమ్మనెను?

=> గిబ్యోను (3:4,5).

22➤ ప్రభువును, సోలోమోను ఏ వరము కోరుకొనెను?

=> మంచి చెడ్డలెంచి పాలించు వివేకమును ప్రసాదింపుమని (3:9)

23➤ సొలోమోను పాలనలో లేఖకుడెవరు?

=> యెహోషాపాతు (43)

24➤ సొలోమోను సైన్యాధిపతి ఎవరు?

=> బెనాయా (4:4)

25➤ సముద్ర తీరమునందలి ఇసుక రేణువులంత విశాల హృదయముకలిగి విస్తరించిన రాజు ఎవరు?

=> సొలోమోను 14:20)

26➤ అందరికంటే గొప్ప జ్ఞానముగల రాజు ఎవరు?

=> సొలోమోను రాజు (4:30)

27➤ జ్ఞానులందరికంటె మించిన జ్ఞానముగలవాడెవ్వరు?

=> సొలోమోను (4:31)

28➤ సొలోమోను రాజు మందిర నిర్మాణము ఎప్పుడు ప్రారంభించెను?

=> సీపు అను రెండవ నెలలో (6:1)

29➤ సొలోమోను నిర్మించిన దేవుని మందిరపు పరిమాణపు కొలతలేవి?

=> 60 మూరల పొడవు, ఇరువది మూరల వెడల్పు, ముప్పదిమూరలు ఎత్తు (6:2).

30➤ సోలోమోను దేవదూతల బొమ్మలను ఏ కొయ్యతో చేయించెను?

=> ఒలీవు కలప (6:23)

31➤ లెబనోను అరణ్యము అను పేరుగల శాల ఉండిన మేడను ఎవరు కట్టించిరి?

=> సొలోమోను(7:2)

32➤ ఎవరు హీరాము కంచుకుంట ఇత్తడితో పోత పోయించెను?

=> సొలోమోను (7:23)

33➤ ఐగుప్తు రాజు ఫరో ఏ నగరమును తగులబెట్టించెను?

=> గేసేరు (9:16)

34➤ వ్యాపార నిమిత్తము ఓడలను నిర్మించిన రాజు ఎవరు?

=> సొలోమోను (9:26).

35➤ సొలోమానురాజు ఏ దేశము నుండి ఓడలలో బంగారమును తెప్పించెను?

=> ఓఫీర్ (9:27,28)

36➤ ఏ రాణి సోలోమోను ప్రసిద్ధిని గూర్చి అతనిని చిక్కు ప్రశ్నలతో పరీక్షించుటకు వచ్చెను?

=> షేబారాణి

37➤ సోలోమోను ఏ కొయ్యతో సంగీతకారులకు పిల్లనగ్రోవులు, వీణలు చేయించెను?

=> చందనపు కలపను (10:12).

38➤ ఎవరు దంతముతో గొప్ప సింహాసనమును చేయించెను?

=> సొలోమోను (10:18)

39➤ ఎవరి కాలమున యెరూషలేమున వెండి రాళ్ళవలె లభించెడిది?

=> సొలోమోను (10:27)

40➤ సొలోమోనురాజు ఎచ్చటి నుండి రథములను తెప్పించెను?

=> ఐగుప్తు (ఈజిప్టు) నుండి (10:29)

41➤ ప్రభువు సోలోమోనుకు శత్రువుగా ఎవరిని పురికొల్పెను?

=> హదదు (11:14)

42➤ ఏ యాజకుడు తాను ధరించుకొన్న క్రొత్త వస్త్రములను విప్పి పండ్రెండు తునకలుగా చేసెను?

=> అహీయా (11:30)

43➤ ముక్కలైన సొలోమోను రాజ్యములో పది ముక్కలను పొందినవారెవరు?

=> యెరోబాము (11:31).

44➤ సొలోమోను కుమారులలో ఎవరు అతని తరువాత రాజయ్యెను?

=> రెహబాము (11:43)

45➤ నా తండ్రి నడుముకంటే నా చిటికెన వేలు పెద్దదిగా ఉండును” అని ఎవరు చెప్పిరి?

=> రెహబాము (12:10)

46➤ ఏ రాజు పెద్దల ఉపదేశమును త్రోసిపుచ్చి యువకులమాటలు వినెను?

=> రెహబాబు (12:13,14)

47➤ ఎవరు రెండు బంగారు కోడెదూడల ప్రతిమలను చేయించి ఒకటి బేతేలునందును, రెండవది దానునందును ప్రతిష్టించిరి?

=> యెరోబాము (12:27-28).

48➤ దైవభక్తినివైపు చేయిచాచి ఇతనిని పట్టుకొనుడు అని ఆజ్ఞాపించిన ఏ రాజు చేయి చాచినది చాచినట్లుగానే కొయ్యబారిపోయెను?

=> యెరోబాము చెయ్యి (13:4)

49➤ ఏ రాజు భార్య మారు వేషములో బిడ్డ గురించి తెలుసుకొనుటకు ప్రవక్త అహీయా వద్దకు వెళ్ళెను.

=> యరోబాము భార్య (14:2).

50➤ ఎవరి సంతతి వారందరిని కసువు వూడ్చినట్లు ఊడ్చివేసెను?

=> యరోబాము (14:10)

51➤ రెహబాము తల్లి పేరేమిటి?

=> నామా (14:21)

52➤ ఎవరు యెరూషలేము మీదికి దండెత్తి మొదటిగా ద్రవ్యమెల్ల దోచుకొని పోయెను?

=> ఐగుప్తు రాజగు షీషకు (14:25, 26)

53➤ ఏ రాజు తన పితామహి మాకా అషేరా దేవతకొక విగ్రహము నెలకొల్పగా ఆమెను రాజమాత పదవినుండి తొలగించెను.

=> ఆసా (15:8-13)

54➤ ఏ రాజు వృద్ధాప్యములో కాలిజబ్బుతో బాధపడెను?

=> ఆసా (15:23)

55➤ ఇశ్రాయేలీయుల రాజైన నాదా ను ఎవరు చంపిరి?

=> బాషా (15:27)

56➤ ప్రభువు ఎవరిని దీనదశ నుండి పైకి తీసికొనివచ్చి యిస్రాయేలుకు రాజుగా నియమించెను?

=> భాషా (16:1,2)

57➤ ఏ రాజు తప్ప త్రాగి పడిపోయెను?

=> ఏలా (16:9)

58➤ ఏ రాజు ఇశ్రాయేలీయులను కేవలము 7 రాజులు పాలించెను?

=> సిమ్ల (16:15)

59➤ ఏ రాజు తన రాజ గృహమునకు నిప్పంటించి ఆ మంటలలోనే ప్రాణము కోల్పోయెను?

=> సిమ్ల (16:18)

60➤ పోరున తిబ్నీ ప్రాణములు కోల్పోగా ఎవరు ఇశ్రాయేలీయులకు రాజైరి?

=> ఒమ్రి(16:22)

61➤ ఏ రాజు సమరియా కొండను కొని, దానిమీద నగరమును నిర్మించెను?

=> ఒత్రీ (16:23,24)

62➤ ఆహాబు భార్య ఎవరు?

=> యెసెబేలు (16:31)

63➤ యెహోషువ శపించిన ఎరికోపట్టణమును పునర్నిర్మించినది ఎవరు?

=> హీయేలు (16:34)

64➤ శపించబడిన యెరికో పట్టణమును తిరిగి కట్టించినదెవరు?

=> ఆహాబు (16:34)

65➤ యెరికో పట్టణమునకు పునాదివేసినపుడు ఎవరు మరణించిరి?

=> హీయేలు జ్యేష్ఠ పుత్రుడు అభిరామ్ (16:34)

66➤ ఏలియా ప్రవక్త జన్మస్థలము ఏది?

=> గిలాదు మండలం తిప్బీ నగరం (17:1)

67➤ ఆహాబు కాలములో శక్తివంతమైన ప్రవక్త ఎవరు?

=> ఏలియా (17:1)

68➤ ఏలియా అను పదమునకు అర్ధమేమి?

=> యావే ప్రభువు (17:1)

69➤ నేను ఆజ్ఞాపించిననే తప్ప వానగాని, మంచుయైనను, కురియదని ప్రవచించినదెవరు?

=> ఏలియా (17:1)

70➤ ఏలియా ఎచ్చట దాగెను?

=> యోధానుకు తూర్పుననున్న కెరీతువాగు దగ్గర (17:3)

71➤ ఏ ప్రవక్తకు కాకులు భోజనము కొనివచ్చెను?

=> ఏలియా (17:4)

72➤ ఎచ్చట దేవుడు ఒక విధవరాలిచేత ఏలియాకు ఆహారము అందించెను?

=> సారెపతు (17:9)

73➤ చనిపోయిన విధవరాలి కుమారుని ఏ ప్రవక్త బ్రతికించెను?

=> ఏలియా (17:22)

74➤ రాజుల కాలములో ఏ దేశము కరువు కాటకములతో దారుణముగానుండెను?

=> సమరియా (18:2)

75➤ ఎవరు నూరుగురు ప్రవక్తలను కొండ గుహలలో దాచివుంచి వారిని అన్న పానీయములతో పోషించెను?

=> ఓబద్యా (18:4)

76➤ ఏరాజు పశువులకు చాలినంత గడ్డి దొరుకునో లేదో పరిశీలించెను?

=> అహాబు (18:5,6)

77➤ ఏ ప్రవక్త అడవిలో రేగు చెట్టు క్రింద కూర్చుండి ప్రాణము విడువగోరెను?

=> ఏలియా (19:4)

78➤ ఏలియా బాలు ప్రవక్తలను ఎచటికి తోడ్కొని రమ్మనెను?

=> కర్మలు కొండమీదకు (18:19)

79➤ ఏరాణి ఏలియాను వధింతునని వార్త పంపించెను?

=> యెసెబెలు (19:2)

80➤ ఏప్రవక్తను దేవదూత తట్టి నిద్రనుండి లేపి లేచి భుజింపుము అని చెప్పెను?

=> ఏలియా (19:5,6)

81➤ ఏ ప్రవక్త నలుబది రోజులు నడచి దేవుని కొండ హోరేబు చేరెను?

=> ఏలియా (19:8)

82➤ ఏప్రవక్త దేవుని స్వరము వినగానే తన అంగీ అంచుతో ముఖము కప్పుకొని నిలిచెను?

=> ఏలియా (19:13)

83➤ ఏలియా తరువాత ప్రవక్తగా అభిషేకించబడినవాడెవరు?

=> అబేల్మెపోలా నివాసి షాపాతు కుమారుడు ఎలీషాను (19:16)

84➤ ఎలీషా నివాస స్థలము ఏది?

=> అబేల్మెపోలా (19:16)

85➤ ఎలిషా తండ్రి యెవరు?

=> షాపాతు (19:16)

86➤ పండ్రెండు అరకలచేత దుక్కిదున్నించుచున్నదెవరు?

=> ఎలీషా (19:19)

87➤ ఏ ప్రవక్త ఎద్దుల మాంసమును వండి, దుక్కిదున్ను అనుచరులకు వడ్డించెను?

=> ఎలీషా (19:21)

88➤ ఆహాబు ఎవరి ద్రాక్షతోటను కూరగాయలు పండించుకొనుటకు అడిగెను?

=> నాబోతు ద్రాక్షాతోటను (21:2)

89➤ ఏ భర్త పేరుమీద ఉత్తరము వ్రాసి, దాని మీద రాజముద్రవేసెను?

=> యెసెబేలు (21:8)

90➤ ఏ భార్య తన భర్త అహాబుచే దుర్మార్గపు పనులు చేయించెను?

=> యెసెబెలు (21:25)

91➤ ఏ రాజువలె దేవునాజ్ఞ మీరి దుర్మార్గపు పనులు చేసినవాడు మరొకడు లేడు?

=> ఆహాబు (21:25)

92➤ నా తండ్రి నుండి లభించిన స్వాస్థ్యమును నేను అమ్మను అన్నదెవరు?

=> నాబోతు (21:3)

93➤ అహాబు రాజు ఏ ప్రవక్తను చెరసాలలో వేయించెను?

=> మీకాయా (22:26-27)

94➤ ఏ ప్రవక్త నిజము చెప్పినందుకు సిద్కియా చెంపలు వాయించెను?

=> మీకాయా (22:24)

95➤ ఆహాబు తరువాత ఇశ్రాయేలీయులకు రాజైనదెవరు?

=> అహస్యా (22:40)

96➤ ఏ ప్రవక్తకు చాలీ చాలని రొట్టె, నీళ్ళు మాత్రమే ఇయ్యబడెను?

=> మీకాయ (22:27)

97➤ యుద్ధ రంగమందు ఎవరు కేకలువేసెను?

=> యెహోషాపాతు (22:32)

98➤ దంతముతో గృహము నిర్మించుకొన్న రాజు ఎవరు?

=> ఆహాబు (22:39)

99➤ ఇశ్రాయేలు పట్టణమున ఎవరి శవమును కుక్కలు పీక్కొని తినును?

=> యెసెబెలు (21:23).

100➤ ఏ దేశమునకు రాజు లేనందున, యూదారాజు నియమించిన రాజ ప్రతినిధి ఆ దేశమును పాలించెను?

=> ఏదోము (22:48).

101➤ ఏ రాజు యొక్క ఓడలు త్రోవలో మునిగిపోయెను?

=> యెహోషాపాతు ఓడలు (22:49)