సంఖ్యా కాండం తెలుగుబైబుల్ క్విజ్ | Roman catholic bible quiz Telugu on Numbers

1➤ సంఖ్యా కాండమును ఎవరు వ్రాసిరి?

=> మోషే

2➤ సంఖ్యా కాండములో ఎన్ని వచనాలున్నాయి?

=> 1288

3➤ ఎక్కడ యిస్రాయేలీ ప్రజల సేకరణ జరిగినది?

=> సీనాయి ఎడారియందు (1:19).

4➤ ఏ గోత్రము యిస్రాయేలీయుల జనాభా లెక్కలలో చేరలేదు?

=> లేవీయులు (1:47).

5➤ లేవీయులు ఏపనికి నియమింపబడిరి?

=> సాక్ష్యపు గుడారమును, దాని సామాగ్రిని కాపాడుట (1:50-54).

6➤ యూదా గోత్ర నాయకుడెవరు?

=> నహషోను (2:3-9)

7➤ ఇస్సాఖారు గోత్ర నాయకుడెవరు?

=> నెతనేలు (2:3-9) 213. సెబూు

8➤ సెబూలూను గోత్ర నాయకుడెవరు?

=> ఎలియాబు (2:8-9).

9➤ దాను గోత్రపు నాయకుడెవరు?

=> అహియేసేరు (2:25-31)

10➤ ఆమెన్ అనే పదము ఏ పుస్తకములో మొదటిగా వాడబడినది?

=> సంఖ్యాకాండము 15:22).

11➤ ఎవరి తలవెంట్రుకలను మంగళికత్తి తాకరాదు?

=> నాసీరువ్రతము పాటించువారు (65)

12➤ యిస్రాయేలు తొలిచూలు బిడ్డలకు మారుగ ఏ గోత్రపువారిని అహరోను మరియు అతని కుమారులకు యివ్వబడెను?

=> లేవీయులు 18:17-19).

13➤ ఏగోత్రము ఎన్నుకోబడి, దేవునికి ప్రత్యేకించబడినది?

=> లేవీయులు (3:12)

14➤ యిస్రాయేలీయులు దూర ప్రయాణములోనున్నను జరుపుకొనవలసిన పండుగ ఏది?

=> పాస్కా పండుగ (9:10)

15➤ యిస్రాయేలీయులు నిబంధన గుడారముతో ఎచటినుండి వారి ప్రయాణము మొదలు పెట్టిరి?

=> సీనాయి ఎడారినుండి (10:11-13)

16➤ సీనాయినుండి బయలుదేరిన మేఘము ఎక్కడ ఆగెను?

=> పారాను ఎడారిలో (9:12)

17➤ మోషే, ఎవరితో నీవు మాకు మార్గదర్శిగా ఉండుము అనెను?

=> హాబాబు (10:31)

18➤ యిస్రాయేలీయులకు ముందుగా వారి విశ్రాంతి విడిదిని వెదకుచు వెళ్ళినది ఏది?

=> యావే నిబంధన మందసము (10:33)

19➤ ఎక్కడ శిబిరమున ఒక భాగము అగ్నిచే కాల్చబడెను?

=> తబేరా (11:1-3)

20➤ బాల్యము నుండి మోషేకు పరిచర్యలు చేయుచున్నది ఎవరు?

=> యెహోషువ (11:28).

21➤ మోషే గురించి దేవుని సాక్ష్యము / ప్రసంస ఏమిటి?

=> మహా వినయవంతుడు (12:3)

22➤ మోషే యితియోపియా స్త్రీని పెండ్లి యాడుటవలన ఎవరు అతనిని విమర్శించిరి?

=> మిర్యాము, అహరోను (12:1).

23➤ ఎక్కడ నుండి మోషే, కనాను దేశమున వేగు నడుపుటకు గోత్ర నాయకులను పంపించెను ?

=> పారాను ఎడారి నుండి (13:3).

24➤ గూడా ఛారులు వేగునడుపుటకు ఎన్ని రోజులు తీసుకొనిరి?

=> 40 (13:26)

25➤ వేగు నడిపినవారిలో "మేము చూచివచ్చిన నేల చాలా మంచిది" అని చెప్పిన ఇద్దరు వ్యక్తులు ఎవరు?

=> యెహోషువ, కాలేబు (14:6,7).

26➤ ఎక్కడ అనాకీయుల వంశము వారు జీవించుచుండిరి?

=> హెబ్రోను (13:22)

27➤ పాలు తేనెలు జాలువారు భూమిగల దేశము ఏది?

=> కానాను (13:26,27).

28➤ యిస్రాయేలీయులు దేవుని ఎన్నిసార్లు పరీక్షించిరి?

=> 10 సార్లు (14:22)

29➤ పూర్ణ ఆత్మతో నన్ను అనుసరించెనని ఏ సేవకుని గురించి యావే పలికెను?

=> కాలేబు (14:24).

30➤ ఈజిప్టు నుండి బయలుదేరి, ఇరువది యేళ్ళకు పైబడిన వారిలో కనాను దేశమును చేరిన ఇద్దరు వ్యక్తులు ఎవరు?

=> కాలెబు, యెహోషువ (14:29,30).

31➤ నేను వీరికి ఏ అపకారము చేయలేదు. తుదకు వీరి గాడిదనైన తీసికొని యెరుగను. అని ఎవరు అనెను?

=> మోషే (16:15).

32➤ ఎవరిని బ్రతికుండగనె, నేలబ్రద్దలయ్యి మ్రింగివేసెను?

=> కోరాను, అతని అనుచరులను (16:31,32).

33➤ ఎవరు ధూపకలశములను బుగ్గినుండి వెలికి దీసిరి?

=> యెలియాసరు (16:37).

34➤ ఎవరు చనిపోయినవారికి, బ్రతికియున్న వారికి నడుమ నిలిచి, ప్రాయశ్చిత్తము చేయు చుండగ అంటు రోగము ఆగిపోయెను?

=> అహరోను (16:48).

35➤ ఏది తిరుగుబాటు దారులకు సూచనగా ఉండును?

=> చిగురించిన అహరోను కట్ట (17:10)

36➤ ఎవరికి యాజకత్వమను వరమును ఇచ్చెను?

=> అహరోను, అతని తనయులకు (187)

37➤ ఎవరికి పదియవ పాలు యియ్యబడును?

=> లేవీయులకు (18:26)

38➤ మిర్యాము ఎచ్చట చనిపోయి సమాధి చేయబడెను?

=> కాదేషో (20:1)

39➤ ఎక్కడ మోషే కర్రతో రాతిని కొట్టగా దాని నుండి జలము పుష్కలముగా వెలువడెను?

=> మెరీబా (2013).

40➤ అహరోనునకు బదులు ప్రధాన యాజకునిగా నియమింపబడినదెవరు?

=> ఎలియాజరు (20:26)

41➤ అహరోను ఏ కొండమీద ప్రాణము విడిచెను?

=> హెరుకొండపై (20:25, 28).

42➤ ఇశ్రాయేలీయులను శపించుటకు బాలాకు రాజు ఎవరిని పిలిపించెను?

=> బలామును (22:4,6)

43➤ యెవాబురాజు బలాకు తండ్రి ఎవరు?

=> సిప్పోర (22:4)

44➤ బలాము తండ్రి ఎవరు?

=> బెయోరు (22:5)

45➤ ఏ జంతువు మనిషివలె మాట్లాడెను?

=> గాడిద (22:28)

46➤ నీవు దీవించిన వారు దీవెనను, శపించినవారు శాపమును పొందుదురని, నా నమ్మకము అని ఎవరు ఎవరిని గురించి పలికెను?

=> బాలాకు, బలాము గురించి (22:56)

47➤ దేవుడు శపింపని వారిని నేనెట్లు శపింతును? దేవుడు దూషింపనివారిని నేనెట్లు దూషింతును? అని ఎవరు ఎవరితో అనెను?

=> బలాము బాలాకుతో అనెను (23.78)

48➤ ఏ జాతి ప్రత్యేకమైనది. ఇతర జాతులకు సాటిలేనిది?

=> ఇశ్రాయేలీయులు (23:9)

49➤ ఎవరి సంతతి భూరేణువులవంటిది, లెక్కలకు అందనిది?

=> యాకోబు (23.10)

50➤ నేను నీతిమంతునివలె మరణింతునుగాక! అని ఎవరు పలికెను?

=> బలాము (23:10).

51➤ ఏ జాతియొక్క గూడు రాతిమీద కట్టబడినది?

=> కేనీయులగూడు (24:21).

52➤ యాజకుడైన ఫీనెహాసుచేత చంపబడిన మిద్యాను స్త్రీ పేరేమి?

=> కొస్బీ (25: 14, 15)

53➤ దేవుడు ఎవరితో సమాధాన నిబంధన చేసెను? అతని సంతతివారు కలకాలము యాజకులగుదురు అని పలికెను?

=> ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసుతో (25:10-15)

54➤ మోషే ఏ ప్రాంతమునుండి వాగ్దాన భూమియైన కనాను దేశమును చూచెను?

=> అబారీముకొండ (27:12).

55➤ మోషే ఎందుకు కనాను దేశమును ప్రేవేశింపలేకపోయెను?

=> సీను ఎడారియందలి మెరిబావద్ద ప్రభువు ఆజ్ఞను జవదాటినందుకు (27:141

56➤ మోషే మరణానంతరము ఇశ్రాయేలీయులకు నాయకుడెవరు?

=> యెహోషువ (27:18).

57➤ యుద్ధమునకు పంపబడిన యాజకుని పేరు ఏమిటి?

=> ఫీనెహాసు (31:6),

58➤ ప్రభువు ఆజ్ఞను పూర్తిగా పాటించినవారెవరు?

=> యెహోషువ మరియు కాలేబు (32:11,12).

59➤ యిస్రాయేలీయులు ఎన్ని సంవత్సరములపాటు యెడారిలో తిరుగాడునట్లు ప్రభువు చేసెను?

=> నలుబది యేండ్ల పాటు (32:13).

60➤ ఎన్ని పట్టణములు, ఎందుకు పారిపోయి తలదాచుకొనుటకై లేవీయుల ఆధీనమున ఉండెను?

=> ఆరు, పొరపాటున ఇతరులను హత్యచేసిన రక్షించుకొనుటకు (35,6).