నెహెమ్యా తెలుగుబైబుల్ క్విజ్ | Telugu Bible Quiz

1➤ నెహెమ్యా తండ్రి యెవరు?

=> హకల్యా (1:1)

2➤ ఏ ప్రాంతములో నెహెమ్యా రాజునకు పానీయ వాహకుడిగా ఉండెను?

=> షూష (1:1,11)

3➤ గోడ పునర్నిర్మాణమపుడు, నెహెమ్యాను చిన్నచూపు చూచి ఎవరు నవ్విరి?

=> సన్బల్లటు, తోబియాయు, గేషెము (2:19)

4➤ నీవు రోగివి కాకున్నను ఎందుకు నీ ముఖములో విషాదము కనిపిస్తుంది? ఈ మాటలు ఎవరు ఎవరితో అనిరి?

=> అర్తహషస్తరాజు నెహెమ్యాతో అన్నమాటలివి (2:2)

5➤ నెహెమ్యా కాలములో ప్రధాన యాజకుడెవరు?

=> ఎల్యాషీబు (3:1)

6➤ ఏ వంశస్తులు మత్సపు గుమ్మమును పునర్నిర్మించిరి?

=> హస్సీనా వంశస్తులు (3:3)

7➤ గోడల మరమ్మత్తుల పనిలో ఎవరి కుమార్తెలు సహాయము చేసిరి?

=> షల్లూము కుమార్తెలు (3:12)

8➤ ఎవరు రాష్ట్ర పాలకునికి లభింపవలసిన భోజన వేతనములను ముట్టుకొని యెరుగడు?

=> నెహెమ్యా (5:14)

9➤ యూదులు గోడ కట్టుచున్నారని విని, "ఈ మొనగాండ్రు బూడిద కుప్ప నుండి రాళ్ళెత్తి భవనములు కట్టుదురా?" అని పరిహసించినది ఎవరు?

=> సన్నల్లటు (4:1,2)

10➤ లంచము తీసుకొని తప్పుడు ప్రవచనము చెప్పినదెవరు?

=> షేమయా (6:10,12)

11➤ నెహెమ్యాను భయపెట్ట జూచిన ప్రవక్తి ఎవరు?

=> నోవద్యా (6:14)

12➤ ప్రభూ! నీ దేవాలయ ఆరాధన కొరకు నేను చేసిన కృషిని విస్మరింపకుము" అని ప్రార్థించినది ఎవరు?

=> నెహెమ్యా (13:14)

13➤ విశ్రాంతి దినమున యెరూషలేములో చేపలను, వివిధ వస్తువులను అమ్మువారు ఎవరు?

=> తూరు నగర వాసులు (13:16)