మీకా తెలుగుబైబుల్ క్విజ్ | Telugu Bible Quiz

1➤ మీకా గ్రంథకర్త ఎవరు?

=> మీకా

2➤ మీకా పేరునకు అర్ధమేమి?

=> ప్రభువును పోలినవాడు

3➤ మీకా ఏ పురవాసి?

=> మోరాషతు (1:1)

4➤ మీకా ప్రవక్త కాలమున యూదా రాజులు ఎవరు?

=> యోతాము, ఆహాసు, హిజ్కియా (1:1)

5➤ ఏ పౌరులను నగరమునుండి బయటికి రావలదు అనెను?

=> జానాను (1:11)

6➤ ప్రభువు యెరూషలేము గుమ్మములోనికి ఏది కొనివచ్చెను?

=> వినాశనమును (1:12)

7➤ ఏప్రజలకిక ఆశలేదు?

=> మారోతు (1:12)

8➤ ఏ ప్రజలకు, ప్రభువు వారి రధములకు గుఱ్ఱములను పూన్చుడు అని చెప్పెను?

=> లాకీషు (1:13)

9➤ ఏ నగరమునకు వీడ్కోలు చెప్పిరి?

=> మోరాషతు గాతు (1:14)

10➤ అక్సీబు అనగా అర్థమేమిటి?

=> సాయము చేయనిది/మోసము చేయునది (1:14)

11➤ నీవు మాకు బుద్ధులు చెప్పనక్కరలేదు, అని ప్రజలు ఏ ప్రవక్తతో అనిరి?

=> మీకా (2:6)

12➤ పర్వతములన్నిటిలో ఉన్నతమైనది ఏది?

=> ప్రభువు మందిరమున్న పర్వతము (4:1)

13➤ దేవుడు ఎవరితో మృదువుగా మాటలాడెను?

=> న్యాయ వర్తనులతో (2:7)

14➤ ప్రభువు తన ప్రజలను ఏ రుజువు మీదినుండి పర్యవేక్షించును?

=> యెరూషలేము (48)

15➤ ఏ ప్రవక్త ఏసుక్రీస్తు జన్మ స్థలము గురించి ప్రవచించెను?

=> మీకా (5:2)

16➤ మీకా ప్రవచనము ననుసరించి, ఏసుక్రీస్తు ఎక్కడ జన్మించును?

=> బెత్లెహేము , ఎఫ్రాతా (5:2)

17➤ ప్రభువు తన ప్రజలనుండి కోరునది ఏమి?

=> న్యాయము, ప్రేమ, వినయము (6:8)

18➤ మనస్సులోని విషయములను భార్యకు కూడ చెప్పకుడని ఎవరు చెప్పెను?

=> మీకా (7:5)

19➤ మనిషికి శత్రువులు ఎవరు?

=> సొంత కుటుంబములోని వారే (7:6)