యోవేలు తెలుగుబైబుల్ క్విజ్ | Telugu Bible Quiz

1➤ యోవేలు పుస్తక రచయిత ఎవరు?

=> యోవేలు

2➤ యోవేలు పుస్తకమున ఎన్ని అధ్యాయములున్నవి?

=> మూడు

3➤ యోవేలు తండ్రి పేరేమిటి?

=> పెతూవేలు (1:1)

4➤ మన దేశమున ఏమి మిగిలివున్నది?

=> మిడుతల దండ్రు వదలివేసినది (1:4,6)

5➤ ఒక దండు వదలివేసినది ఏది మ్రింగివేసినది?

=> మరొక మిడుతలదండు (1:4,6)

6➤ త్రాగుబోతులారా! మీరు నిద్రమేల్కొని శోకింపుడు అని ఎవరు చెప్పిరి?

=> యోవేలు (1:5)

7➤ వధువు తాను పరిణయమాడనున్న యువకుడు మరణింపగా శోకించినట్లు ఎవరు శోకింపవలెను?

=> త్రాగుబోతులు (1:8,5)

8➤ యోవేలు ఎవరిని గోనెతాల్చి విలపింపుమనెను?

=> యాజకులను (1:13)

9➤ ప్రభువు శీతాకాల వర్షమును, వసంత కాల వర్షమును దయచేయునని ఎవరు చెప్పెను?

=> యోవేలు (2:23)

10➤ ప్రభువు తన ఆత్మను ఎల్లరిపై కుమ్మరించునని ఎవరు ప్రవచించిరి?

=> యోవేలు (2:28)

11➤ ఎపుడు సూర్యుని చీకట్లు క్రమ్మును, చంద్రుడు నెత్తురువలె ఎర్రబడును?

=> భీకరమైన ప్రభువు మహా దినము సమీపించినపుడు (2:31)

12➤ యోవేలు గ్రంథ ముఖ్య సందేశము?

=> తీర్పు

13➤ ప్రభువు జాతులన్నిటిని ఎక్కడ ప్రోగుచేయును?

=> యెహోషాపాతు

14➤ యెహోషాపాతు లోయకు మరోపేరేమిటి?

=> తీర్పులోయ (3:12, 14)

15➤ దేవుని మందిరము నుండి ఒక యేరుపారి ఏ లోయను తడుపును?

=> షిత్తీము (3:18)