యోబు గ్రంథము తెలుగుబైబుల్ క్విజ్ | Telugu Bible Quiz

1➤ యోబు పేరునకు అర్థమేమి?

=> సహించువాడు

2➤ యోబు ఏ దేశస్థుడు?

=> ఊజు దేశస్థుడు (1:1)

3➤ యోబుకు ఎంతమంది కుమారులు, కుమార్తెలు కలరు?

=> ఏడుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు (1:2)

4➤ తూర్పు దేశీయులందరికంటే మహా సంపన్నుడెవరు?

=> యోబు (1:3)

5➤ విందు సమయాలలో తన సంతానము కొరకు ప్రాయశ్చితబలిని అర్పించినదెవరు?

=> యోబు (1:5)

6➤ దేవదూతలతో పాటు దేవుని సన్నిధికి వెళ్ళినదెవరు?

=> సాతాను (1:6)

7➤ ఏ ధర్మాత్ముని కుటుంబమును దేవుడు కాపాడుచుండెను?

=> యోబు (1:10).

8➤ పెనుగాలి వచ్చినపుడు ఇల్లు కూలి మీదపడగా ఎవరి పిల్లలు చనిపోయిరి?

=> యోబు (1:19).

9➤ “నేను నా తల్లి గర్భము నుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. అని అన్నదెవరు?

=> యోబు 1:21)

10➤ ఎన్ని దురదృష్టములు వాటిల్లినను ఎవరు దేవునిపై నేరము మోపి పాపము కట్టుకొనలేదు?

=> యోబు (1:22)

11➤ అరికాలు మొదలుకొని నడినెత్తివరకు బాధగల కురుపులతో మొత్తబడినదెవరు?

=> యోబు (2:7)

12➤ "దేవునిని దూషించి మరణించు అని ఎవని భార్య సలహాయిచ్చెను?

=> యోబు భార్య (2:9)

13➤ యోబు ముగ్గురు స్నేహితులెవరు?

=> ఎలీఫసు, బిల్టదు, సోఫరు (2:11)

14➤ తన పుట్టిన దినమును శపించుకొన్నదెవరు?

=> యోబు (3:1)

15➤ “నిప్పు రవ్వలు పైకి ఎగురనట్లు నరులు తమ తిప్పలను తామే కొనితెచ్చుకొనును" ఈ మాటలెవరివి?

=> ఎలీఫసు (5:7)

16➤ ఆకుకూర కాడలోని సారములో ఏమి రుచి ఉన్నది అని ఎవరు అనిరి?

=> యోబు (6:6)

17➤ స్వర్గములో నా పక్షమున ఒక సాక్షినిలిచి నన్ను సమర్ధించి మాటలాడునని ఎవరు అనిరి?

=> యోబు (16:19)

18➤ ఈ శరీరముతోనే నేను ప్రభువును దర్శింతునని పలికినది ఎవరు?

=> యోబు (19:26)

19➤ ప్రభువు దృష్టిలో చంద్రునకు ప్రకాశము చాలదు అని ఎవరు అనిరి?

=> బిల్డదు (21:1,5)

20➤ భూమిని నిరాధారముగా నిల్పినది ప్రభువే అని పలికినదెవరు?

=> యోబు (26:7)

21➤ నరులు భూమి గర్భమును చీల్చి చిందరవందర చేయుదురని ఎవరు అనిరి?

=> యోబు (28:5)

22➤ నా ఆక్రందనము నక్కల అరుపులవలె విచార సూచకమని ఎవరు పలికిరి?

=> యోబు (30:29)

23➤ ఏ పక్షికి తెలివితేటలు, ఆలోచనలేవు?

=> నిప్పుకోడికి (39:13-17)

24➤ ఎవరు తన కన్నులతో నిబంధన చేసికొనిరి?

=> యోబు (31:1)

25➤ ఏ జంతువు ఎముకలు ఇత్తడి వలె గట్టిగా వున్నవి?

=> నీటి గుఱ్ఱపు ఎముకలు (40:14,18)

26➤ ఏది తుమ్మినపుడు ప్రకాశము వెలువడును?

=> నీటి గుర్రం (40:14, 18).

27➤ తన స్నేహితుల కొరకు ప్రార్ధించిన దైవజనుడెవరు?

=> యోబు (42:10)

28➤ తనకు పూర్వము కలిగిన దానికంటె రెట్టింపు సంపదను దేవుడు ఎవరికి ప్రసాదించెను?

=> యోబు భక్తునకు (42:10)

29➤ ప్రారంభ దినములకంటె కడపటి దినములలో ఎక్కువగా దీవించబడినవాడెవడు?

=> యోబు (42:12).

30➤ యోబు మొదటి కుమార్తె పేరేమిటి?

=> యెమీమా (42:14)

31➤ ఎవరి కుమార్తెలు లోకములో గొప్ప అందగత్తెలు?

=> యోబు కుమార్తెలు (42:15)

32➤ ఏ తండ్రి తన కుమారులతోపాటు కుమార్తెలకు కూడ ఆస్తిలో భాగమునిచ్చెను?

=> యోబు (42:15)