హగ్గయి తెలుగుబైబుల్ క్విజ్ | Telugu Bible Quiz

1➤ హగ్గయి గ్రంథములో ఎన్ని అధ్యాయములు ఉన్నవి?

=> రెండు

2➤ హగ్గయి గ్రంథ రచయిత ఎవరు?

=> హగ్గయి

3➤ ఏ రాజు కాలమున హగ్గయి ప్రవచించెను?

=> దర్యావేషు (1:1)

4➤ హగ్గయి ద్వారా దేవుని సందేశము ఏ యూదా రాష్ట్ర పాలకునికి ఉ ద్దేశింపబడినది?

=> సెరుబ్బాబెలు (1:1)

5➤ సెరుబ్బాబెలు తండ్రి పేరేమిటి?

=> షయలీయేలు (1:1)

6➤ ప్రధాన యాజకుడు యెహోషువ తండ్రి పేరేమిటి?

=> యెహోసాదాకు (1:1)

7➤ ప్రభు దూతగా పిలువబడిన ప్రవక్తఎవరు?

=> హగ్గయి (1:13)

8➤ దేవాలయ నిర్మాణమునకు దేవుడు ఎవరిని ప్రేరేపింపగా, వారు మందిర పనిచేయ ఆరంభించిరి?

=> సెరుబ్బాబెలు, యెహోషువ (2:14).

9➤ జాతులన్ని కోరదగినది ఎవరు?

=> రక్షకుని (2:7)

10➤ దేవుడు ఎవరిని తన అంగుళీయక ముద్రనుగా చేసుకొని స్వీకరించెను?

=> సెరుబ్బాబేలు (2:23)