ఎజ్రా తెలుగుబైబుల్ క్విజ్ | Telugu Bible Quiz

1➤ ప్రభువు ఏ పారశీక రాజు అంతరంగమున ప్రబోధించి, యెరూషలేమున తనకి దేవాలయమును నిర్మింపుమని కోరెను?

=> కోరేషు (1:1-3)

2➤ పూర్వము ఏరాజు యెరూషలేము దేవాలయమునుండి కొనివచ్చిన వానిని కోరే రాజు తిరిగి యిచ్చి వేసెను?

=> నెబుకద్నెజరు (1:7)

3➤ కోరేషురాజు కోశాధికారి ఎవరు.?

=> మిదాతు (1:8)

4➤ సెరుబ్బాబెలు మరియొక పేరేమి?

=> షేష్బరు (1:11)

5➤ ఎవరు మందిర నిర్మాణమునకు పూనుకొనిరి?

=> సెరుబ్బాబెలు (3:8)

6➤ ఏ చక్రవర్తి దేవాలయ నిర్మాణము ఆపించెను?

=> అర్హహషస్త (4:23-24)

7➤ యాజకుడైన ధర్మశాస్త్ర కోవిదుడు ఎవరు?

=> ఎజ్రా (7:12)

8➤ యాజకుడైన ఎజ్రా కోరినదంతా క్రమము తప్పక సమకూర్చవలెనని కోశాధికారులందరికి ఆజ్ఞ యిచ్చిన చక్రవర్తి ఎవరు?

=> అర్తహషస్త (7:21)

9➤ సురక్షిత ప్రయాణము కొరకు ప్రభువునెదుట వినయముతో ఉపవాసము చేయవలెనని ఆజ్ఞాపించినది ఎవరు?

=> ఎజ్రా (8:21)

10➤ ఏ నదియొడ్డున ఎజ్రా మరియు అతని మిత్రులు ఉపవాసముండిరి?

=> అహవానది దగ్గర (8:21)

11➤ ఎవరు తన తల వెంట్రుకలను, గడ్డపు వెంట్రుకలను పెరికికొని విషాదముతో నేలపై చతికిలబడెను?

=> ఎజ్రా రాజు (93)