ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక పై తెలుగు బైబుల్ క్విజ్ | Roman catholic bible quiz Telugu on Ephesians

పౌలు ఎఫెసీయులకు వ్రాసిన లేఖ  పై  తెలుగుబైబుల్ క్విజ్

Ephesians Bible Quiz Answers in Telugu | Telugu Bible Quiz | Telugu Bible Quiz on Ephesians Book | Telugu Bible Quiz on Ephesians With Answers

1➤ ఎఫెసీయుల లేఖ వ్రాసినదెవరు?

=> పౌలు (1:1)

2➤ ఆధ్యాత్మిక ఆశీర్వాదములు మనకు ఎక్కడ లభించును?

=> క్రీస్తునందు (1:1)

3➤ మన స్వాతంత్ర్యమును ధృవపరచునది ఎవరు?

=> పవిత్రాత్మ (1:14)

4➤ సంఘమునకు పునాది రాయి ఎవరు?

=> క్రీస్తు (2:20)

5➤ నేను అందరికంటె అల్పుడను అని ఏ అపొస్తలుడు పలికెను?

=> పౌలు (38)

6➤ సూర్యుడు అస్తమించకముందు మీలో చల్లారి పోవలెను?

=> కోపము (4:26)

7➤ పౌలు ఉద్దేశ్యములో ఎవరికి చోటివ్వకూడదు?

=> సైతాను 14:27)

8➤ విమోచన దినము వరకు ఎవరియందు ముద్రింపబడియున్నాము?

=> పవిత్రాత్మకు / పరిశుద్ధాత్ముడు (4:30)

9➤ మీలో ఏ విధమైన విషయాలు ఉండకూడదు, పేరైనను ఎత్తకూడదు?

=> జారత్వముకాని, యేవిధమైన అపవిత్రతయేగాని, లోభత్వమేగాని ఉండకూడదు (5:3)

10➤ దినములు చెడ్డవి గనుక మనము దేనిని పోనివ్వక జాగ్రత్తపడవలెను?

=> సమయమును (5:16)

11➤ తన తల్లిని తండ్రిని విడిచి పురుషుడు ఎవరితో ఐక్యమగును?

=> భార్యతో (5:31)

12➤ ఆకాశమందున్న దురాత్మల సమూహముతో పోరాడుటకు మనము ఏమి ధరించవలెను?

=> దేవుడిచ్చు సర్వాంగ కవచము (6:13)

13➤ దేవుని బిడ్డలు సాతానును ఎదుర్కొనుటకు నడుముకు ఏమి కట్టుకొనవలెను?

=> సత్యమను దట్టీని కట్టుకొనవలెను (6:14)