దర్శన గ్రంధం బైబుల్ క్విజ్ | bible quiz on revolution | telugu bible quiz on revelation | Telugu Bible Quiz

 25 Bible Questions in Telugu From Revelation | Telugu Bible Quiz

1➤ క్రొత్త నిబంధనను గురించి ప్రకటించిన గ్రంథమేది?

=> దర్శన గ్రంథము

2➤ దర్శన గ్రంథమును వ్రాసిన అపోస్తలుడు ఎవరు?

=> యోహాను

3➤ ఏ ప్రాంతమును గురించి ఏడు సంఘములవారిని ఉదహరించిరి?

=> ఆసియా గురించి (1:4)

4➤ ఏ ద్వీపాన్ని గురించి యోహాను అతిశయపడెను?

=> పత్మాసు (1:9)

5➤ ఏ సంఘము మొదటి వలె ఇపుడు ప్రేమించుటలేదు?

=> ఎఫెసు సంఘము (2:4)

6➤ మరణ పర్యంతమువరకు విశ్వాసములో నిలిచియుండు సంఘమునకు ఎట్టి కిరీటము ఇవ్వబడును?

=> జీవ కిరీటము (2:10)

7➤ క్రీస్తునందు విశ్వాసమును త్యజించిన వాడెవరు?

=> అంతిప (2:13)

8➤ ప్రవక్తినని చెప్పుకొనుచున్న ఏ స్త్రీని గురించి తయతీర సంఘము ఓర్చుకొనెను?

=> యెసెబెలు (2:20)

9➤ యే సంఘము దేవుని మాటలను అనుసరించెను?

=> ఫిలదల్పియా సంఘము (3:8)

10➤ నులివెచ్చగా ఉన్న సంఘమేది?

=> లవొదికయ సంఘము (3:6)

11➤ యూదా గోత్రపు సింహము ఎవరు?

=> యేసు క్రీస్తు (5:5)

12➤ ఇశ్రాయేలీయుల గోత్రములన్నింటిలో ముద్రింపబడినవారు ఎంతమంది?

=> 1,44,000 (7:4)

13➤ ఆకాశము నుండి రాలిపడిన గొప్ప నక్షత్రమేది?

=> చేదు నక్షత్రము (8:10,11)

14➤ హెబ్రీ భాషలోను, గ్రీకు భాషలోను దేవదూత పేరేమిటి?

=> హెబ్రీ భాషలో అబదోననియు, గ్రీకు భాషలో అపొల్లుయోను (9:11)

15➤ ఏ నదియొడ్డున నలుగురు దూతలు బంధింపబడిరి?

=> యూప్రటీస్ అను మహానది యొడ్డున

16➤ చిన్న పుస్తకమును దూత చేతిలో నుండి తీసికొని తినివేసినదెవరు?

=> యోహాను (10:10)

17➤ మృగము యొక్క సంఖ్య ఎంత?

=> అదియొక మనుష్యుని సంఖ్యయే, ఆ సంఖ్య 666 (13:18)

18➤ ఏ స్త్రీ అనేక జలములమీద కూర్చుండెను?

=> మహా వేశ్య అగు బబులోను మహానగరము (17:1)

19➤ జనుల శబ్దము వంటి గొప్ప స్వరము వినబడెను అది ఎటువంటి స్వరము?

=> అది అల్లెలూయా అను స్వరము (19:1)

20➤ ఒక్క గడియలోనే శిక్షింపబడిన గొప్ప పట్టణమేది?

=> బబులోను పట్టణము (18:10)

21➤ గొప్ప ఘట సర్పమును పట్టుకొని పాతాళమునందు ఎన్ని సంవత్సరములు బంధించెను?

=> వేయి సంవత్సరములు (20:2)

22➤ నూతన యెరూషలేమునకు ఎన్ని ద్వారములు కలవు?

=> పండ్రెండు ద్వారములు (21:12)

23➤ శుద్ధమైన బంగారముతో నిర్మించబడిన పట్టణమేది?

=> నూతన యెరూషలేము (21:18)

24➤ పట్టణ ప్రాకార పునాదిరాళ్ళకు వాడబడిన పండ్రెండు విలువైన రత్నాలు ఏవి?

=> సూర్యకాంతమణి, రెండవది నీలము, మూడవది రత్నము నాలుగవది మరకతము, అయిదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణ రత్నము, ఎనిమిదవది. గోమేధికము, తొమ్మిది పుష్యరాగము పదియవది సువర్ణ సునీయము, 11. పద్మరాగము 12. ఊదామణి. (21:19,20)

25➤ నేను అల్ఫాయు ఒమేగను, మొదటివాడను కడపటివాడను అని ఎవరనిరి?

=> యేసుక్రీస్తు (22:13)

Post a Comment

0 Comments

Ad Code