మక్కబీయులు రెండవ గ్రంథము తెలుగుబైబుల్ క్విజ్ | Telugu Bible Quiz

1➤ మక్కబీయులు రెండవ గ్రంథమున ఎన్ని అధ్యాయాలున్నాయి?

=> 15 అధ్యాయాలు

2➤ క్లీ సెవునెల 25వ తేదీన గుడారముల పండుగవలె, మరే పండుగను జరుపుకొందురు?

=> దేవాలయ శుద్ధీకరణ పండుగ (1:18)

3➤ ప్రజలు 'సప్తా' అనిపిలిచే 'నెప్తారు' మాటకు అర్థము ఏమిటి?

=> శుద్ధీకరణము (1:36).

4➤ యిర్మియా గుడారమును, మందసమును, పీఠమును ఎచట భద్రపరచి దాని ద్వారమును మూసివేసెను?

=> కొండమీద గుహలో (2:5)

5➤ ఎవరెవరు ప్రార్థనచేయగా ఆకాశము నుండి అగ్ని దిగివచ్చి బలిపశువును దహించెను?

=> మోషే, సోలోమోను (2:9,10).

6➤ ఏ ఉత్సవమును జరుపుకోవలెనని చెప్పుటకు లేఖ వ్రాసిరి?

=> దేవాలయ శుద్దీకరణోత్సవం (2:16)

7➤ ఎవరు ప్రధాన యాజకుడుగానుండిన కాలమున, పవిత్ర నగరమైన యెరూషలేము శాంతి సౌభాగ్యాలకు ఆటపట్టుగా నుండెను?

=> ఓనియాసు (3:1)

8➤ దుష్క్రియలు సహింపనివాడు, భక్తుడు అయిన ప్రధాన యాజకుడు ఎవరు?

=> ఓనియాసు(3:1)

9➤ జగద్విఖ్యాతమును, పవిత్రమైన దేవాలయమేది?

=> యెరూషలేము దేవాలయము (3:12)

10➤ ప్రభువు దర్శనమువలన ఎవరు మాటలు కోల్పోయి, అనారోగ్య స్థితిలో పడియుండెను?

=> ప్రధానమంత్రి హెలియోడోరసు (3:29).

11➤ హెలియోడోరసు ఆరోగ్యము కొరకు ఎవరు బలినర్పించెను?

=> ఓనియాసు(3:22)

12➤ ఎవరు దేవాది దేవుడగు ప్రభువు చేసిన అద్భుత కార్యమును ఎల్లరికిని విదితము చేసెను?

=> హెలియోడోరసు (336)

13➤ ప్రజలెల్లరి శ్రేయస్సును మనసులో పెట్టుకొని ఎవరు రాజును దర్శించెను?

=> ఓనియాసు (46)

14➤ మోసముతో ప్రధాన యాజకుడు అయినదెవరు?

=> ఓనియాసు తమ్ముడు యాసోను (47)

15➤ గ్రీకుల ఆచార వ్యవహారములను పాటింపుడని యూదులను ప్రోత్సహించిన ప్రధాన యాజకుడు ఎవరు?

=> యాసోను 14:10).

16➤ పరమ దుర్మార్గుడు, భక్తి లేనివాడు, అక్రమముగా ప్రధాన యాజకుడు అయిన వాడు ఎవడు?

=> యాసోను (4:13).

17➤ క్రీడాగారమున కుస్తీ పోటీలను, ఆటలను ప్రారంభింపగానే ధర్మశాస్త్ర నిషేధమునుకూడ లెక్కచేయక పరుగెత్తెడివారు ఎవరు?

=> యాజకులు (4:14).

18➤ అన్నను మోసగించి, ప్రధాన యాజకుడైన యాసోను ఇపుడు ఎవరి మోసమునకు గురియై అమ్మోను దేశమునకు పారిపోయెను?

=> మెనెలాసు (4:23,26).

19➤ క్రూరుడు, నియంత, భీకరమైన వన్య మృగము వంటి ప్రధాన యాజకుడెవరు?

=> మెనెలాసు (4:25).

20➤ ఓనియాసును అధర్మముగా హత్య చేసినది ఎవరు?

=> అండ్రోనికో (4:34)

21➤ ఊడదీయించి నగర నడివీధులగుండా నడిపించి మట్టుపెట్టిరి?

=> అండ్రోనికో (4:38).

22➤ ఎవరికి మిగుల పొగరెక్కగా మెట్టనేలమీద ఓడలను, సముద్రము మీద సైన్యములను నడిపింతును అనుకొనెను?

=> అంతియోకసు (5:21)

23➤ ఎవరి మరణము యువకులకేకాక, యూదజాతికి అంతటికి ఆదర్శప్రాయము. చిరస్మరణీయము అయ్యెను?

=> ఎలియాసరు (6:31)

24➤ ఘోర యాతనలన్నిటికి కారణము మా తప్పిదములే అని పలికినది ఎవరు?

=> ఆరవసోదరుడు (7:18).

25➤ ఎలియాసరు పవిత్ర గ్రంథము నుండి ఏ వాక్యమును యుద్ధనాదముగా వాడుకొనిరి?

=> ప్రభువు నుండి మనకు సహాయము లభించును (8:23).

26➤ అనేకుల కడుపునకు చిచ్చుపెట్టిన ఎవనికి, కడుపునొప్పి సముచితమైన శిక్ష అయ్యెను?

=> ఆంటియోకసు రాజు (9:6)

27➤ నరమాత్రులు దేవునికి లొంగియుండవలెనుగాని, తాము దేవునితో సమానులమనుకొనరాదు, అని పలికిన రాజు ఎవరు?

=> ఆంటియోకసు

28➤ ఎవరు ప్రతి యుద్ధమున గెలుపొందెడివాడు?

=> యూదా (10:23)

29➤ ఎవరి సైన్యము తమ పరాక్రమము మీద, దైవబలము మీద ఆధారపడెను?

=> యూదా (10:28).

30➤ ప్రభువు కరుణతో పంపిన దివ్య పురుషుడు ఎవరితో వెళ్ళెను?

=> యూదా సైనికులు (11:9,10)

31➤ ఎవరు యామ్నియా ప్రజలు ఆరాధించు దేవతల బొమ్మలను, తమ దేహములమీద బట్టల మాటున కట్టుకొనియుండిరి?

=> పోరున చచ్చిన యూదులందరు (12:40).

32➤ పాప ఫలితమును కన్నులారా చూచితిరి. కనుక ఇకమీదట పాపమునుండి వైదొలగుడు, అని ఎల్లరిని హెచ్చరించినది ఎవరు?

=> యూదా (12:42)

33➤ మృతుల ఉత్థానమును విశ్వసించి, పాప పరిహారబలిని సమర్పించుటకు యెరూషలేమునకు సొమ్మును పంపినది ఎవరు?

=> యూదా (12:43).

34➤ ఎవరు తన అనుచరులకు “దేవుని నుండి విజయము" అను వాక్యమును యుద్ధనాదముగా వాడుకోవలెనని చెప్పెను?

=> యూదా (13:15)

35➤ ఎవరి ప్రోత్సాహంతో యూదా వివాహమాడి ప్రశాంతముగా జీవింప జొచ్చెను?

=> నికానోరు (14:24,25).

36➤ జీవమునకు, శ్వాసమునకు అధిపతియైన ప్రభువునకు ప్రార్థనచేసి, విసిరి కొట్టిన తన ప్రేవులను ఒక దినమున మరల తనకు ప్రసాదింపుమని వేడుకొని కన్నుమూసినది ఎవరు?

=> రాగిసు (14:46)

37➤ “విశ్రాంతి దినమును పాటింపుడని ఆజ్ఞాపించిన దేవుడొకడు స్వర్గమున ఉ న్నాడా”, అని వేళాకోళము చేసిన దుష్టుడెవరు?

=> నికానోరు (15:3)

38➤ నికానోరు (15:3), యూదా కలలో ఎవరు చేతులు చాచి యూదజాతి అంతటి కొరకు ప్రార్ధన చేయుచుండెను?

=> మహానుభావుడు, వినయవంతుడు, మృదుస్వభావి, మంచివక్త, ధర్మబద్ధముగా జీవించిన ఓనియాసు (15:12).

39➤ యూదులకొరకు, పరిశుద్ధ నగరము కొరకు అధికముగ ప్రార్థన చేయునది ఎవరని ఓనియాసు, యూదాకు చెప్పెను?

=> యిర్మీయా (15:13)

40➤ ఎవరికి చిన్ననాటి నుండి ఉన్న దేశభక్తి ఇసుమంతైనా తరుగలేదు?

=> యూదా (15:30)