తిమోతికి వ్రాసిన మొదటి లేఖ పై తెలుగు బైబుల్ క్విజ్ | Roman catholic bible quiz Telugu on 1st Timothy

1➤ 1తిమోతి రచయిత ఎవరు?

=> పౌలు

2➤ విశ్వాసమును బట్టి పౌలుకు నిజమైన కుమారుడెవరు?

=> తిమోతి (1:2)

3➤ పూర్వము హింసకుడును, హానికరుడైనవాడెవడు?

=> పౌలు (1:13)

4➤ ఏ అపోస్తలుడు ఘోరమైన పాపి?

=> పౌలు (1:15)

5➤ మనస్సాక్షిని త్రోసివేసి కొందరు విశ్వాస విషయమై ఓడబద్దలైపోయినవారివలె చెడియున్నారు? ఎవరువారు?

=> హుమెనేయు, అలెగ్జాండరులు (1:19,20)

6➤ ఏ అపోస్తలుడు విశ్వాస విషయములో అన్యులకు బోధించుటకు నియమింపబడెను?

=> పౌలు (2:7)

7➤ శారీరక వ్యాయామము కొంత విలువగలిగియున్నది. ఈ మాటలు ఎవరివి?

=> పౌలువి (4:8)

8➤ నేనువచ్చు వరకు వాక్యమును చదువుటయందును హెచ్చరించుట యందును, బోధించుట యందును, కాలమును వినియోగించుము ఈ మాటలు ఎవరు ఎవరికి తెలిపిరి?

=> పౌలు తిమోతికి (4:13)

9➤ ఏది అన్ని అనర్థాలకు కారణమైనది?

=> ధనాపేక్ష (6:10)

10➤ దైవజనుడా అని పౌలు ఎవరిని సంబోధించెను?

=> తిమోతిని (6:11)

11➤ ఎవరి యెదుట యేసు క్రీస్తు సత్యమునకు సాక్షిగా నిలిచెను?

=> పొంతి పిలాతు యెదుట (6:13)

12➤ ఎవరు శ్రీమంతుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు?

=> యేసుక్రీస్తు (6:15)