యోహాను వ్రాసిన మొదటి లేఖ పై తెలుగు బైబుల్ క్విజ్ | Roman catholic bible quiz Telugu on 1st John

యోహాను వ్రాసిన మొదటి లేఖ  పై  తెలుగుబైబుల్ క్విజ్

1st John Bible Quiz Answers in Telugu | Telugu Bible Quiz | Telugu Bible Quiz on 1st John Book | Telugu Bible Quiz on 1st John With Answers

1➤ యోహాను మొదటి పత్రికను ఎవరు వ్రాసిరి?

=> యోహాను

2➤ మన సమస్త పాపమును శుద్ధిచేయునదియేది?

=> యేసు రక్తము (1:7)

3➤ తండ్రి కుమారులను ఇరువురను తిరస్కరించువాడెవడు?

=> క్రీస్తు విరోధి (2:22)

4➤ దుష్టునితో ఏకమైనవాడు అని ఎవరిని గురించి ఈ మాట చెప్పబడెను?

=> కయీనును గురించి (3:12)

5➤ ఏది విజయమును చేకూర్చును?

=> దేవుని నుండి వచ్చునదంతయు లోకమును ఓడించును.

6➤ సృష్టి ఆరంభము నుండి గల జీవవాక్కును చెవులారా విని, కన్నులారా కాంచి, చేతులతో తాకితిమి అని తెలిపినది ఎవరు?

=> అపోస్తులు (1:1)

7➤ దేవుని బిడ్డలుగా జీవించువారు ఎవరు?

=> సత్ప్రవర్తనకలవారు (2:29)

8➤ యధార్ధప్రేమ ఎటుల నిరూపింపబడును?

=> మాటలు, సంభాషణలు, చేతల ద్వారా (3:18)

9➤ దేవుని శాసనము ఏది?

=> ఏసుక్రీస్తును విశ్వసించి ఆయన ఆజ్ఞాపించిన అన్యోన్య ప్రేమ కలిగి వుండుట (3:23).

10➤ భయమును తరిమివేయునది ఏది.

=> పరిపూర్ణ ప్రేమ (4:18)

11➤ దేవుని ప్రేమింతుమని చెప్పుకొనుచు, తమ సోదరులను ద్వేషించువారు ఎట్టివారు?

=> అసత్యవాదులు (4:20)

12➤ దేవుడు తన కుమారునిగూర్చి ఒసగిన సాక్ష్యాధారములు మూడు ఏవి?

=> 1. ఆత్మ 2. జలము 3. రక్తము (5:7,8,9)

13➤ దేనిని గూర్చి దేవుని ప్రార్ధింపవలయునని చెప్పుటలేదు?

=> మరణకరమైన పాపమును గూర్చి (5:16).